https://oktelugu.com/

Alia Bhatt: కూతురి ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుండి తొలగించిన అలియా భట్..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఏడాది తిరిగేలోపే పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాప కి రాహా అనే పేరు కూడా పెట్టారు. ఈ పాప సోషల్ మీడియా లో ఇటీవల కాలం లో పెద్ద ట్రెండింగ్ టాపిక్.

Written By:
  • Vicky
  • , Updated On : March 1, 2025 / 06:13 PM IST
    Alia Bhatt

    Alia Bhatt

    Follow us on

    Alia Bhatt: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ లో ఒకరు అలియా భట్(Alia Bhatt). ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె, అద్భుతమైన నటిగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కేవలం నటిగా మాత్రమే కాదు, అందాల ఆరోబోత విషయం లో కూడా అలియా భట్ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. హీరోయిన్ గా నెంబర్ 1 రేంజ్ కి చేరుకున్న సమయంలో ఆమె ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir kapoor) ని పెళ్లాడింది. చాలా కాలం నుండి అతనితో డేటింగ్ చేసి, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి పెళ్ళై రెండేళ్లు గడుస్తుంది. ఏడాది తిరిగేలోపే పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాప కి రాహా అనే పేరు కూడా పెట్టారు. ఈ పాప సోషల్ మీడియా లో ఇటీవల కాలం లో పెద్ద ట్రెండింగ్ టాపిక్.

    Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు

    ఎంతో క్యూట్ గా కనిపించే ఈ చిన్నారు రీసెంట్ గా అభిమానులకు అభివాదం చేస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో మనమంతా చూసాము. చిన్నతనం లోనే ఇంత ముద్దుగా అభిమానులను పలకరించే విధానం చూసి ఈ చిన్నారి కి అందరూ ఫిదా అయిపోయారు. రాహా కి సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇక అలియా భట్ ఇంస్టాగ్రామ్ చూస్తే మొత్తం రాహా మాయమై ఉండేది. ఆమెకి సంబంధించిన క్యూట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని పంచుకునేది. కానీ ఇప్పుడు ఆమె తన ఇంస్టాగ్రామ్ నుండి రాహా కి సంబంధించిన ఫొటోలన్నీ తొలగించింది. కేవలం కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోని మాత్రమే ఉంచింది. అందులో కూడా రాహా ముఖం కనిపించకుండా చేశారు. ఇలా చిన్న పిల్లల ఫోటోలను చూపించకుండా ఉండడమే మంచిదని, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని కొంతమంది ఇలాంటి ఫోటోలను దుర్వినియోగపరుస్తున్నారని నెటిజెన్స్ చెప్పుకొచ్చారు.

     

    Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!