https://oktelugu.com/

Senior Actor Naresh: ట్రోల్ చెయ్యడం కోసం 15 కోట్లు ఖర్చు చేసిన నరేష్..ఈయన పిచ్చి వేరే లెవెల్ లో ఉందిగా!

అతని పైత్యం చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సార్లు ఇతనికి మతి స్థిమితం బాగానే ఉందా అనిపిస్తుంది. రీసెంట్ గానే ఆయన పవిత్ర లోకేష్ ని నాల్గవ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ పెళ్లి కారణంగా నరేష్ సోషల్ మీడియా లో గత ఏడాది నుండి ట్రెండ్ అవుతూనే ఉన్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 12, 2023 / 07:56 AM IST

    Senior Actor Naresh

    Follow us on

    Senior Actor Naresh: ఒక నటుడిగా టాలీవుడ్ లో నరేష్ కి లెజెండ్ స్థానం ఉంది.ఆరోజుల్లో కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ తో సరిసమానమైన ఇమేజి సంపాదించిన నరేష్, హీరో కెరీర్ ముగిసాక క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ లో ఇంకా ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేసే టాలెంట్ ఉన్న నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.నటుడిగా ఎంత ఎత్తు ఎదిగినా , వ్యక్తిగతంగా నరేష్ చేసే కొన్ని పనులు చాలా చిల్లరగా ఉంటున్నాయి.

    అతని పైత్యం చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సార్లు ఇతనికి మతి స్థిమితం బాగానే ఉందా అనిపిస్తుంది. రీసెంట్ గానే ఆయన పవిత్ర లోకేష్ ని నాల్గవ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ పెళ్లి కారణంగా నరేష్ సోషల్ మీడియా లో గత ఏడాది నుండి ట్రెండ్ అవుతూనే ఉన్నాడు.

    అయితే ఆయన నాల్గవ పెళ్లి గురించి ఏకంగా ఒక సినిమానే తీసాడు, ఆ చిత్రం పేరు ‘మళ్ళీ పెళ్లి’.నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలైంది.ఈ సందర్భంగా నరేష్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసాడు. ఈ సమావేశం లో ఒక యాంకర్ ఈ సినిమాని మీరు మీ మూడవ భార్య రమ్య రఘుపతి మీద రివెంజ్ తీర్చుకోవడానికే చేశారా అని అడగగా దానికి నరేష్ సమాధానం చెప్తూ ‘రమ్య మీద పగ తీర్చుకోవడానికి నేను 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా..?,యూట్యూబ్ లో డబ్బులిస్తే ట్రోల్ల్స్ చేసే వారు దొరకరా..ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు, ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి అనేదే మేము ఈ చిత్రం ద్వారా చెప్పాలి అనుకున్నాము’ అని అంటాడు నరేష్, కానీ ఆయన పైకి అలా చెప్పినా కూడా ఈ చిత్రం కేవలం మూడవ భార్య ని టార్గెట్ గా చేసి తీసింది అని అందరికీ అర్థం అవుతుంది.