https://oktelugu.com/

Custody Twitter Talk: కస్టడీ ట్విట్టర్ టాక్: నాగ చైతన్యకు మామూలు దెబ్బ కాదు… తమిళ దర్శకులను నమ్ముకుంటే ఇంతే!

యూఎస్ లో కస్టడీ చిత్రం ప్రీమియర్స్ ముగిశాయి. ట్విట్టర్ వేదికగా చిత్రం ఎలా ఉందో ఆడియన్స్ తమ స్పందన తెలియజేస్తున్నారు. పారిపోయిన ఓ ఖైదీని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసేందుకు ఒక కానిస్టేబుల్ పడే ఇబ్బందుల సమాహారమే కస్టడీ మూవీ.

Written By:
  • Shiva
  • , Updated On : May 12, 2023 / 08:01 AM IST

    Custody Twitter Talk

    Follow us on

    Custody Twitter Talk: నాగ చైతన్య ఆ మధ్య వరుస హిట్స్ ఇచ్చారు. మజిలీ అనంతరం ఆయన నటించిన చిత్రాలన్నీ దాదాపు విజయం సాధించాయి. గత ఏడాది చివర్లో విడుదలైన థాంక్యూ మాత్రం భారీ డిజాస్టర్. దర్శకుడు విక్రమ్ కుమార్ కెరీర్ లోనే వరస్ట్ మూవీ తెరకెక్కించారు. దీంతో నాగ చైతన్య సక్సెస్ జర్నీకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో సాలిడ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ కావాలని ఆశపడ్డారు. కస్టడీ మూవీ కసిగా చేశారు. మరి ఆయన కల కస్టడీ నెరవేర్చిందా? ఆడియన్స్ ఏమంటున్నారు?

    యూఎస్ లో కస్టడీ చిత్రం ప్రీమియర్స్ ముగిశాయి. ట్విట్టర్ వేదికగా చిత్రం ఎలా ఉందో ఆడియన్స్ తమ స్పందన తెలియజేస్తున్నారు. పారిపోయిన ఓ ఖైదీని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసేందుకు ఒక కానిస్టేబుల్ పడే ఇబ్బందుల సమాహారమే కస్టడీ మూవీ. దీనిలో హీరోయిన్ పాత్రను జొప్పించి రొమాన్స్ పంచారు. అలాగే ఎమోషన్ క్రియేట్ చేశారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ చిత్రాన్ని తెరకెక్కించారు. బహుశా కోలీవుడ్ కథలు, దర్శకుల ఆలోచనలు మన హీరోలకు సెట్ కావేమో.

    గతంలో కూడా కోలీవుడ్ దర్శకులతో పనిచేసిన తెలుగు హీరోలుదెబ్భైపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య పరిస్థితి కూడా అదే అంటున్నారు. కస్టడీ మూవీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదని ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు. కొత్తదనం లేని కథ, పట్టు లేని స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయని అంటున్నారు. మెల్లగా సాగే కథనం,ప్రిడిక్టబుల్ నెరేషన్ సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయని అంటున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కి కూడా నెగిటివ్ మార్క్స్ పడుతున్నాయి.

    బీజీఎం పర్లేదు. సాంగ్స్ మాత్రం దారుణం అంటున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నాగ చైతన్య, అరవింద స్వామి, కృతి శెట్టి, ప్రియమణి నటన పాజిటివ్ అంశాలుగా చెప్పుకొస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాత్రం విఫలం చెందారన్న మాట వినిపిస్తోంది. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటే కస్టడీ చెప్పుకోదగ్గ చిత్రం కాదు. నాగ చైతన్యకు మరోసారి నిరాశ మిగిల్చేలా ఉందంటున్నారు.

    అయితే ఆడియన్స్ లో ఒక వర్గం మూవీ సూపర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. కస్టడీ మూవీతో నాగ చైతన్య హిట్ కొట్టేశారంటున్నారు. కస్టడీ మూవీ రిజల్ట్ ఏమిటో తెలియాలంటే కనీసం వీకెండ్ వరకు వేచి చూడాలి. సమ్మర్ లో విడుదలైన చాలా చిత్రాలు నిరాశపరిచాయి. ఒక్క విరూపాక్ష మాత్రమే విజయం సాధించింది.

    https://twitter.com/onlyForRAM/status/1656839010436644866

    https://twitter.com/srinivasrtfan2/status/1656835993625047040

    https://twitter.com/ReviewMamago/status/1656827812668665856