Allari Movie Comedians: ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన హీరో రాజేంద్ర ప్రసాద్.ఈ జానర్ లో ఆయన రేంజ్ హీరో మళ్ళీ రారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రేంజ్ కాకపోయినా నేటి తరం హీరోలలో కామెడీ అనగానే మనకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి హీరో పేరు అల్లరి నరేష్.ఈయన సినిమాలకు ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పడింది.
ఈవీవీ సత్యనారాయణ లాంటి లెజెండ్ కొడుకు అయ్యినప్పటికీ మొదటి సినిమా నుండే ఆయన తనదైన స్టైల్ లో కెరీర్ ని ప్రారంభించాడు.తండ్రి పెద్ద దర్శకుడు అయ్యినప్పటికీ కూడా మొదటి సినిమా ఆయన దర్శకత్వం లో చెయ్యలేదు. సీనియర్ నటుడు చలపతి రావు కొడుకు రవిబాబు దర్శకత్వం లో నటించాడు.ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, అప్పటి నుండి నరేష్ కి ‘అల్లరి’ ఇంటి పేరుగా మారిపోయింది.
ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అనే విషయం అందరికీ తెలుసు కానీ, అప్పట్లో ఎంత వసూళ్లను రాబట్టింది, ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.అయితే దీనికి సంబంధించిన వివరాల కోసం వెతికితే సోషల్ మీడియా లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ చిత్రాన్ని అప్పట్లో 70 లక్షల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారు.
థియేటర్స్ లో విడుదలైన తర్వాత సుమారుగా రెండు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతకి రెండు కోట్ల రూపాయిల లాభాల్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా.ఈ చిత్రం తర్వాత అల్లరి నరేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు, మధ్యలో కొన్ని డిఫరెంట్ సబ్జక్ట్స్ చేసాడు కానీ, ఆ తర్వాత ఎక్కువగా కామెడీ సినిమాలనే నమ్ముకున్నాడు.మళ్ళీ ఇప్పుడు రూట్ మార్చి వరుసగా సీరియస్ జానర్ సినిమాలు చేస్తున్నాడు