Scam 2010 – The Subrata Roy Saga : దేశంలోనే అతిపెద్ద స్కాం ‘సహార’ కథ ఇక సినిమాగా.. స్కాం ఫ్రాంచైజీ సంచలనం

2014లో సహారా ఇండియా పరివార్ ఇన్వెస్టర్లను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయ్యాడు. అతను నవంబర్ 2023 లో కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా మరణించాడు.

Written By: NARESH, Updated On : May 16, 2024 5:37 pm

Scam 2010 - The Subrata Roy Saga

Follow us on

Scam 2010 – The Subrata Roy Saga : సోనీ లివ్ యొక్క స్కామ్ సిరీస్ పెద్ద ఫ్రాంచైజీగా ఏర్పడింది. ‘స్కామ్ 1992’, ‘స్కామ్ 2003’ తర్వాత, ఇప్పుడు సీజన్ త్రీని ‘స్కామ్ 2010’ ప్రకటించారు మేకర్స్. ఈసారి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, హన్సల్ మెహతా ‘సుబ్రతా రాయ్’-సహారా కథను తీసుకువస్తున్నారు. టైటిల్ ‘స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ సాగా’గా పెట్టారు. చిత్ర నిర్మాత హన్సల్ మెహతా ‘స్కామ్ 2010’ ప్రకటన టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచేలా కొంత సమాచారం కూడా ఇచ్చాడు.

మళ్లీ దర్శకుడి కుర్చీలోకి వస్తున్న హన్సల్..
సీజన్‌ త్రీకి తానే దర్శకత్వం చేస్తున్నట్లు హన్సల్ ప్రకటించాడు. హర్షద్ మెహతా కథ ఆధారంగా ‘స్కామ్ 1992’ చిత్రానికి హన్సల్ దర్శకత్వం వహించాడు. అదే సమయంలో, అబ్దుల్ కరీం తెల్గీ కథ ఆధారంగా ‘స్కామ్ 2003’కు హన్సల్ కుమారుడు జై మెహతా దర్శకత్వం వహించాడు.

స్కామ్ సీజన్ 1లో ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్ర పోషించగా.. సీజన్ 2లో అబ్దుల్ కరీం తెల్గి పాత్రను గగన్ దేవ్ రియార్ పోషించాడు. తెల్గీ స్టోరీ రిలీజైన తర్వాత గగన్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘స్కామ్ 2010’లో ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారో ఇంకా తెలియరాలేదు.

సుబ్రతా రాయ్ ఎవరు?
స్కా్మ్ 2010ను సుబ్రతా రాయ్ కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుబ్రతా రాయ్ సహారా గ్రూప్ ఫౌండర్. పెట్టుబడిదారుల మోసానికి అరెస్టయ్యాడు. 2014లో రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో జైలుకు వెళ్లాడు. రెండేళ్లపాటు జైలులో ఉన్న తర్వాత, సుబ్రతా 2016లో పెరోల్‌పై బయటకు వచ్చాడు. పెరోల్‌ను రద్దు చేయాలని సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా) సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లాడు.

సుబ్రతా రాయ్ చేసిన ‘స్కామ్‘
సుబ్రతా రాయ్ 1978లో కేవలం 2000 రూపాయలతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అనేక చిట్-ఫండ్ పథకాలను ప్రారంభించాడు. బ్యాంకింగ్ రంగంపై పెద్దగా అవగాహన లేకున్నా.. కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను బ్యాంకుల ద్వారా సేకరించాడు. 2010లో సెబీ అతనిపై కేసు నమోదు చేసినప్పుడు మూడు కోట్ల మంది నుంచి రూ.24 వేల కోట్లు వసూలు చేసినట్లు తేలింది.

తనను తాను ‘సహారా శ్రీ’ అని పిలుచుకునే సుబ్రతా రాయ్‌ను టైమ్స్ మ్యాగజైన్ భారతీయ రైల్వే తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా ‘సహారా’ అని ప్రకటించింది. రాజకీయాలు, బాలీవుడ్‌ స్టార్లతో సంబంధాలున్న సుబ్రతా రాయ్ 90లో వేగంగా అభివృద్ధి చెందారు. 2004లో బిగ్ బీగా పిలవబడే అమితాబ్ బచ్చన్, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు అతడి కుమారుడి వెడ్డింగ్ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

2014లో సహారా ఇండియా పరివార్ ఇన్వెస్టర్లను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయ్యాడు. అతను నవంబర్ 2023 లో కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా మరణించాడు.