https://oktelugu.com/

బాలయ్యకు జోడీ కుదిరింది.. పెళ్లి తర్వాత రీ ఎంట్రీ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో హట్రిక్ మూవీ రాబోతుంది. దీంతో ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. Also Read: ఛార్మీ కొడుకుతో ప్రభాస్.. చూస్తే షాకే..! పేరు కూడా ఖరారుకానీ బాలయ్య-బోయపాటి సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 12:17 PM IST
    Follow us on

    నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో హట్రిక్ మూవీ రాబోతుంది. దీంతో ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    Also Read: ఛార్మీ కొడుకుతో ప్రభాస్.. చూస్తే షాకే..!

    పేరు కూడా ఖరారుకానీ బాలయ్య-బోయపాటి సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగును కరోనా నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రభియనం చేస్తున్నాడు. దీంతో బాలయ్య పక్కన నటించే హీరోయిన్స్ ఎవరనే ఆసక్తి నెలకొంది.

    Also Read: ‘ఖిలాడీ’లో అనసూయ.. రెచ్చిపోనుందా?

    బాలకృష్ణకు జోడీగా సయేషా సైగల్ ఖరారైనట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సయేషా సైగల్ తెలుగులో ‘అఖిల్’ సినిమాలో నటించింది. ఆమె నటించిన ఒకే ఒక చిత్రం ‘అఖిల్’ మూవీ కావడం విశేషం. సయేషా సైగల్ పలు హిందీ, తమిళ్, తెలుగు సినిమాల్లో నటించింది. 2019లో నటుడు, నిర్మాతైన ఆర్యను సయేషా వివాహం చేసుకుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సయేషా సైగల్ పెళ్లి తర్వాత బాలయ్య సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వనుంది. సయేషా నటించిన ‘అఖిల్’ చిత్రం 2015లో రిలీజైంది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో ఆమె నటించలేదు. తాజాగా బాలయ్య-బోయపాటి కాంబోలో హీరోయిన్ గా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత సయేషా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందులో సెకండ్ హీరోయిన్ గా పూర్ణ ఎంపికైందనే టాక్ విన్పిస్తోంది. ఈ మూవీని మిర్యాల రవీంద్ నిర్మిస్తున్నాడు.