Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ కోసం ప్రధానమంత్రి మోడీ.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే అప్డేట్ అతి త్వరలో!

అక్టోబర్ 23 వ తారీఖుతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఇక నిర్మాతలు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా, గ్రాఫిక్స్ వర్క్ ని కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : September 30, 2024 8:42 am

Hari Hara Veera Mallu

Follow us on

Hari Hara Veera Mallu: రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో ది అవతార్’ వంటి వరుస రీమేక్ సినిమాలు చేసాడు. వీటిల్లో రెండు హిట్ అయ్యాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ భారీ వసూళ్లను చూడలేకపోయాయి. అభిమానులు ఆయన నుండి ఒక ‘గబ్బర్ సింగ్’ లాంటి రీసౌండ్ వచ్చే బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సూపర్ హిట్ రావాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా తన తోటి హీరోలు లాగా పాన్ ఇండియన్ భారీ చిత్రాలు చేయాలి. అభిమానుల కోరికకు తగ్గట్టు గానే ఆయన ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల్లో రెండు పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రాలే. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ ని మళ్ళీ ప్రారంభించుకుంది.

అక్టోబర్ 23 వ తారీఖుతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఇక నిర్మాతలు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా, గ్రాఫిక్స్ వర్క్ ని కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు. అమరావతి లో వేసిన భారీ సెట్స్ లో ఇటీవలే పవన్ కళ్యాణ్ పై ఒక యాక్షన్ సన్నివేశం, అలాగే ఒక పాటని చిత్రీకరించారు. ఈ పాటని పవన్ కళ్యాణ్ స్వయంగా పాడబోతున్నాడని సమాచారం. దీపావళి కి ఈ పాట ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూస్ ఇచ్చేందుకు ఇష్టపడడు. కానీ ఈ సినిమా హిందీ ప్రొమోషన్స్ కోసం ఆయన అనేక ఇంటర్వ్యూస్ ని ఇవ్వబోతున్నాడట.

నిర్మాత ఏఎం రత్నం కి కూడా ప్రొమోషన్స్ గట్టిగా చేద్దాం అని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడట. అయితే ఈ సినిమా దేశ భక్తికి సంబంధించినది గా ఉంటుంది కాబట్టి, విడుదలకు ముందు స్పెషల్ ప్రీమియర్ షో ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షా కి వేసి చూపించాలనే ప్లాన్ లో ఉన్నారట నిర్మాత ఏఎం రత్నం. ఒకవేళ అదే జరిగి ప్రధాన మంత్రి మోడీ ఈ సినిమా గురించి నాలుగు వ్యాఖ్యలు చేస్తే, బాలీవుడ్ మొత్తం వసూళ్ల సునామి కురుస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ పెడుతాడో చూడాలి.