https://oktelugu.com/

Beast Movie: సినిమా ఫ్లాపయితే.. ఆ పార్టీలెందుకు రాజా..? ‘బీస్ట్’ చిత్ర యూనిట్ పై సెటైర్లు

Beast Movie: ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే దీనిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ మొదటి రోజు తరువాత నుంచే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాను కొనుక్కున్న డిస్ట్రీబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. అయితే మూవీ యూనిట్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోందట..! హీరో విజయ్ తో పాటు కొందరు టెక్నీషియన్స్ కలిసి ఓ హోటళ్లో విందు ఏర్పాటు […]

Written By: , Updated On : April 27, 2022 / 09:57 AM IST
Follow us on

Beast Movie: ఇళయ దళపతిగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే దీనిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ మొదటి రోజు తరువాత నుంచే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాను కొనుక్కున్న డిస్ట్రీబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. అయితే మూవీ యూనిట్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోందట..! హీరో విజయ్ తో పాటు కొందరు టెక్నీషియన్స్ కలిసి ఓ హోటళ్లో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పిక్ బయటకు రావడంతో వైరల్ అయింది. ఈ ఫొటోను చూసిన ‘బీస్ట్’ డిస్ట్రిబ్యూటర్లు ‘సినిమాను కొని మేం నష్టపోతుంటే.. మీరు ఎంజాయ్ చేస్తున్నారా రాజా..?’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Beast Movie

Beast Movie

తమిళ సినీ ఇండస్ట్రీలో విజయ్ కి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అటు ‘కో కోకిల’, ‘డాక్టర్’ సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. దీంతో ఈ దర్శకుడు దళపతి విజయ్ తో ఓ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ‘మనీ హో స్ట్’ కంటెంట్ తో నెల్సన్ దిలీప్ కుమార్.. హీరో విజయ్ ను సంప్రదించాడు. ‘బీస్ట్ ’ కథను వినిపించడంతో విజయ్ వెంటనే ఓకే చెప్పాడు. దీంతో ఆయనతో కలిసి సినిమా తీశారు. అయితే ఈ సినిమాలో అనిరుధ్ పాడి మ్యూజిక్ చేసిన ‘అరబి కుతు’ సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఇప్పటికీ ఇంకా స్ట్రీమింగ్ అవుతోంది.

‘అరబి కుతు’ ప్రభంజనంతో సినిమా రేంజ్ పెరుగుతుందని ఊహించారు. దీంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు కొందరు డిస్ట్రిబ్యూటర్లు కోట్లు పెట్టి సినిమాను కొనుక్కున్నారు. అయితే సినిమాలో కంటెంట్ కు ప్రేక్షకులు ఆదరించలేదు. ఇదే సమయంలో యశ్ నటించిన ‘కేజీఎప్ 2’ రిలీజైంది. ఈ సినిమా దెబ్బకు ‘బీస్ట్’ తట్టుకోలేకపోయింది. విజయ్ కున్న ఆదరణతో ఓపెనింగ్స్ కాస్త రాబట్టినా ఆ తరువాత రోజు నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా కేజీఎఫ్ 2 సినిమా కోసం తమిళనాడులోనే కొన్ని థియేటర్లలో బీస్ట్ సినిమాను తీసేశారు.

Beast Movie

beast movie

అయితే ఓ వైపు సినిమా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కానీ ఈ సమయంలో బీస్ట్ టీం మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోంది. ఓ హోటల్ లో పార్టీ చేసుకున్న ఓ ఫొటో లీకైంది. ఇందులో హీరో విజయ్ కూడా ఉండడంతో ఆ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ‘ఓ వైపు సినిమా డిజాస్టర్ గా మిగిలి మేం ఏడుస్తుంటే.. మీరు ఎంజాయ్ చేస్తున్నారా రాజా..’ అంటూ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానుల నుంచి కామెంట్లు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బీస్ట్ సినిమాను తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు.

Recommended Videos:

Greatness of Akira Nandan || Pawan Kalyan Son Akira Nandan Donated Blood || Oktelugu Entertainment

Tollywood Young Actress to Act With Mahesh Babu || Mahesh Babu Trivikram Movie || #SSMB28

Super Star Mahesh Babu Shocking Reaction on KGF Chapter 2 || KGF 2 || Oktelugu Entertainment

Tags