Pawan Kalyan: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన బాధాకరమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి బాధ వర్ణనాతీతం. సగటు మనిషిని సాధించడమే ధ్యేయంగా ఆస్పత్రి నిర్వహణ కనిపిస్తోంది. మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బులు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ కావాలని మరీ డిమాండ్ చేయడం దారుణమైన విషయం. దీనిపై అన్ని వర్గాల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నార. శాపనార్థాలు పెడుతున్నారు.
ఆస్పత్రికి వస్తే జాలి పడాల్సింది పోయి డబ్బుల కోసం వేధించడంతో పేదవారు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొడుకు పోయిన దుఖంలో అతడుంటే రూ. ఇరవై వేలు ఇవ్వాలని అతడిని బాధ పెట్టడం సరైంది కాదు. దీంతో మృతదేహాన్ని బైక్ పై 90 కిలోమీటర్లు తీసుకెళ్లడం చూస్తుంటే అందరికి బాధ కలిగింది. ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం కేవలం డాక్టర్, సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోయిందా? బాధితుడికి ఏ సాయం అందించారు. అతడి మానసిక క్షోభకు ఎంత మూల్యం చెల్లిస్తారు.
వైద్యులు చికిత్స చేయాలి. అంబులెన్స్ లు సేవలు అందించాలి. కానీ అవి చేయకుండా సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందివచ్చిన వారి దగ్గర ఇష్టం వచ్చినట్లు దండుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం అందరిలో వస్తోంది. దీంతో పేదవాడు బతకడానికి కూడా వీలు లేదని తెలుస్తోంది. లేకపోతే ఉచిత అంబులెన్స్ సేవలు అందించాల్సి ఉన్నా డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంనై ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రంలో ఆస్పత్రుల వైఫల్యాలు కళ్లకు కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. యాజమాన్యాలకే వత్తాసు పలుకుతోంది. దీంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోజువారీ కూలి చేసుకునే బాధితులు వేలల్లో ఎక్కడి నుంచి తెస్తారు. ఎలా బతుకుతారనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంల రుయా ఆస్పత్రి నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్నాయి.
ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంతో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా వారిని పెంచిపోషిస్తున్నారు. కనీసం పల్లెత్తు మాట కూడా అనడం లేదు. దీంతో వారి ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు. వస్తే వస్తారు? లేదంటే రారు? అంతా వారి కనుసన్నట్లో నడుస్తోంది. అందుకేు ఇంతటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం సమిధలవుతున్నారు. గతంలో ఆస్పత్రుల తీరుపై ప్రశ్నిస్తే డాక్టర్ సుధాకర్ ను బంధించి చిత్రహింసలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఆస్పత్రుల తీరుతో సామాన్యడు మాత్రం తీవ్రంగా బాధలక గురవుతున్నాడు. కన్న కొడుకు చనిపోతే కనీసం అంబులెన్స్ కూడా సమకూర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుయా ఆస్పత్రి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కన్నవారి కడుపుకోతను ఇలాగేనా చూసేదని అందరిలో ఆగ్రహం వస్తోంది. అందరిని బాధిస్తున్న దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి సంఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Old TV Anchors: ఒకప్పటి ఈ బుల్లితెర యాంకర్స్ గుర్తున్నారా.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..
Recommended Videos: