https://oktelugu.com/

Prashant kishor- YCP: పీకే సేవలు వైసీపీకి అక్కర్లేదా? ఈ వ్యూహం వెనుక మర్మమేమిటి?

Prashant kishor- YCP: వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వైసీపీ వద్దనుకుందా? లేక ప్రశాంత్ కిశోర్ వైసీపీని వద్దనుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయంగా ఈ హాట్ టాపిక్ నడుస్తోంది. పీకే కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారం నేపథ్యంలో జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీశారు. కాంగ్రెస్ పార్టీ పాత కాపులు, ఆ పార్టీతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నవారు, కాంగ్రెస్ భావజాలంతో ఉన్న పార్టీలను కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని అధిష్టానానికి పీకే తేల్చి […]

Written By:
  • Admin
  • , Updated On : April 27, 2022 / 10:03 AM IST
    Follow us on

    Prashant kishor- YCP: వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వైసీపీ వద్దనుకుందా? లేక ప్రశాంత్ కిశోర్ వైసీపీని వద్దనుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయంగా ఈ హాట్ టాపిక్ నడుస్తోంది. పీకే కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారం నేపథ్యంలో జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీశారు. కాంగ్రెస్ పార్టీ పాత కాపులు, ఆ పార్టీతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నవారు, కాంగ్రెస్ భావజాలంతో ఉన్న పార్టీలను కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని అధిష్టానానికి పీకే తేల్చి చెప్పారు. దేశంలో ఏయే పార్టీలతో ముందుకెళితే లాభమో ఒక బ్లూ ప్రింట్ సైతం ఇచ్చారు. అందులో ఏపీ నుంచి వైసీపీ పార్టీని సూచించారు. అప్పటి నుంచి కాక పుట్టుకుంది.

    Prashant kishor- YCP

    అంతటా ఇదే చర్చనీయాంశమైంది. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. పైగా రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే పార్టీలతో కలిసి పనిచేస్తామని వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ నాయకత్వం గమనిస్తోంది. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు జగన్ అనుమతి లేనిదే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రతిపాదన తెస్తారా అన్న టాక్ నడుస్తోంది. అటు జాతీయ మీడియాలో కూడా ఇదో ప్రాధాన్య అంశంగా ప్రచారం చేశారు. దీనిపై బీజేపీ అగ్ర నాయకత్వం సైతం ఆరాతీసింది. తెర వెనుక వైసీపీ ఏదో జగన్నాటకం ఆడుతుందని అనుమానం వ్యక్తం చేయడం ప్రారంభించింది. దీంతో ఇది తమ మెడకు చుట్టుకోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధిష్టానం తాత్కాలికంగా అంశాన్ని పక్కన పడేయాలని భావించింది. అందుకే పార్టీ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకోవడం లేదని తేల్చిచెప్పారు. గత ఎన్నికలకు ముందు ఆ పార్టీ సేవలు తీసుకున్నామని.. ఆ తర్వాత నుంచి సేవలు కొనసాగించడం లేదని తేల్చిచెప్పారు.

    కొనసాగుతున్న ఐ ప్యాక్ సేవలు

    గెలిచే పార్టీకి మాత్రమే పీకే పనిచేస్తాడన్న ప్రచారం ఉంది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో పీకే ఐపాక్ టీమ్ పాత్ర ఉందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడంలో ఐ ప్యాక్ టీమ్ పన్నాగాలు అన్నీఇన్నీ కావు. సోషల్ మీడియాలో జగన్ హైప్ చేసి చూపించిన ఘనత పీకేదే. అందుకే పీకేతో ఇప్పటికీ జగన్ స్నేహం కొనసాగిస్తున్నారు. గెలిచిన తరువాత ఒకానొక దశలో కేబినెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా పీకేను తీసుకురావడానికి జగన్ తెగ ప్రయత్నించారు. కానీ ఎందుకో వీలుపడలేదు.

    Jagan

    గత ఎన్నికల తర్వాత పీకే టీంలో చాలా మందికి ప్రభుత్వంలో డిజిటల్ పదవులు ఇచ్చారు. వారంతా ఇప్పుడు వైసీపీతోనే పని చేస్తున్నారు. ఇక పీకే సేవలు అవసరం లేదనుకున్నారేమో స్పష్టత లేదు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన బ్లూ ప్రింట్‌లో పలు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచించారు. ఆ బ్లూ ప్రింట్‌లో ఏపీలో వైసీపీలో పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. ఆ విషయంపై జాతీయ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ విషయంలో వైసీపీ సానుకూలంగా ఉందన్నప్రచారం ఊపందుకుంది. వైసీపీ స్పందించకపోవడంతో ఇవి పెరిగిపోతున్నాయని గమనించిన వైసీపీ హైకమాండ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

    క్లారిటీ మిస్

    ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని మాత్రమే సజ్జల ప్రకటించారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో పెట్టుకుంటారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సజ్జల నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఈ విషయంలో స్పష్టత లేకపోయినా కేసుల భయం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో బీజేపీకి భయపడే స్వేచ్ఛగా తమ పార్టీ విధానాన్ని హైకమాండ్ చెప్పలేకపోతోంది. ఒక వేళ బీజేపీ నుంచి రిక్త హస్తం ఎదురైతే పీకే ద్వారా కాంగ్రెస్ కు దగ్గరవ్వాలన్న యోచనలో వైసీపీ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ రాజకీయంగా ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని వైసీపీ భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ జాతీయ స్థాయికి వచ్చేసరికి మాత్రం తటపటాయిస్తోంది. అసలు మాకు పీకే అవసరం లేదన్న బిల్డప్ ఇస్తొంది. ఇప్పటికీ పీకే కు చెందిన ఐ ప్యాక్ సేవలను వినియోగించుకుంటోంది. కానీ అసలు వచ్చే ఎన్నికల్లో అసలు పీకే సేవలు వినియోగించుకోవడం లేదని చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి వైసీపీ ధైర్యం చేయకపోవడాన్ని నిరసిస్తూ పీకే వైసీపీకి దూరం జరిగాడా? లేక బీజేపీకి భయపడి పీకేను వైసీపీ దూరం పెట్టిందా? అన్నది మాత్రం క్లారిటీ లేదు.

    Tags