Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను నేటికీ కలిచివేస్తూనే ఉంది. తోటి సినీ తారల మనసులను ఇప్పటికీ బాధతో కప్పేసే ఉంది. అయితే, దివంగత పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి ఇచ్చేందుకు ఆయన అభిమానుల వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఓ ఉపగ్రహన్ని నింగిలోకి పంపించనున్నారు.
కాగా ఈ శాటిలైట్‌ను కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందిస్తున్నారు. ఇస్రో సహకారంలో శాటిలైట్‌ను ప్రయోగించనున్నారు. కిలోన్నర బరువుతో తయారుచేసిన ఈ శాటిలైట్‌కి రూ. 1.90 కోట్లు ఖర్చు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి అశ్వథ్ నారాయణ తెలిపారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ కు అమెజాన్ ప్రైమ్ కూడా ఘన నివాళి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
పునీత్ నటించి, నిర్మించిన ఐదు సినిమాలను.. అభిమానులు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. ఇక కన్నడ పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఎదిగి, తన తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గొప్ప స్టార్ డమ్ సంపాదించాడు. అయితే, కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ జీవితం క్రమశిక్షణతో సాగింది. అందుకే, పునీత్ రాజ్‌కుమార్ కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా నెంబర్ వన్ హీరోగా కొనసాగారు.
అన్నిటికి మించి కన్నడ ఇండస్ట్రీలో డ్యాన్స్ లను, ఫైట్స్ లను ఓ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. కన్నడలో ఈ జనరేషన్ హీరోల్లో పునీత పేరిట ఉన్న రికార్డ్స్ మరో హీరోకి లేవు. పునీత్ పేరిట నాలుగు కన్నడ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. పైగా పునీత్ నటించిన అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ ఈ నాలుగు చిత్రాలు కన్నడలో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి.
ఇక పునీత్ తెలుగు నటులు అన్నా, తెలుగు టెక్నీషియన్స్ అన్నా ఎంతో గౌరవంగా చూసేవాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను తన సొంత తమ్ముడిలా పునీత్ ఫీల్ అయ్యేవాడు. ఇక పునీత్ కెరీర్ లో మరో గొప్ప విషయం ఏమిటంటే.. 1985లోనే ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెల్చుకున్నాడు. ఈ ఘనత ఇప్పటికీ గొప్ప రికార్డ్ గానే మిగిలిపోయింది.
Also Read: బాలీవుడ్‌లో భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ కారణం వల్లే లేట్ అయిందంట