https://oktelugu.com/

Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ధనుష్‌కి తెలుగులో తప్ప తమిళం, హిందీలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే వెంకీ అట్లూరి, శేఖర్‌ కమ్ములతో వరుస సినిమాలను చేస్తున్నాడు. అయితే తమిళంలో ఇప్పుడు ధనుష్‌ అభిమానులు ‘మారన్‌’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో నిజాయితీగల జర్నలిస్ట్‌గా ధనుష్‌ కనిపించనున్నట్టు ట్రైలర్‌ చెబుతోంది. అయితే గతంలో రంగం సినిమాను గుర్తు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 1, 2022 / 03:15 PM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ధనుష్‌కి తెలుగులో తప్ప తమిళం, హిందీలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే వెంకీ అట్లూరి, శేఖర్‌ కమ్ములతో వరుస సినిమాలను చేస్తున్నాడు. అయితే తమిళంలో ఇప్పుడు ధనుష్‌ అభిమానులు ‘మారన్‌’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో నిజాయితీగల జర్నలిస్ట్‌గా ధనుష్‌ కనిపించనున్నట్టు ట్రైలర్‌ చెబుతోంది. అయితే గతంలో రంగం సినిమాను గుర్తు చేస్తూ అంత ఆసక్తిగా అనిపించట్లేదు.

    maran

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. యుద్ధం అన్నాక ఏదో ఒకరోజు ముగుస్తుంది. బద్ధ శత్రువులుగా ఉన్న ఇరు దేశాల నేతలు నవ్వుకుంటూ కాలం గడిపేస్తారు. ఎటుతిరిగి మరణించినవారు, వారి కుటుంబాలు తప్ప, అని రష్యా-ఉక్రెయిన్ వార్‌ గురించి ఓ ట్వీట్‌ పెట్టాడు వర్మ. నేడు జెలెన్‌ స్కీ, డిఫెన్స్‌ మినిస్టర్‌తో కలిసి దిగిన సెల్ఫీ చూసి ఇది నిజమే అంటున్నారు నెటిజన్లు. ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే, మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేందుకు ఇలా చేశాడట.

    Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

    Ram Gopal Varma on Twitter

    ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. నేచురల్ స్టార్ నాని జోరు మీదున్నాడు. చాలా కాలం తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. మరో కొత్త మూవీ షురూ చేశాడు. ‘దసరా’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది.

    కాగా కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. సింగరేణి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నాడు.

    Also Read:  సౌత్ లోకి రాబోతున్న కంగనా మూవీ

    Tags