Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata Trailer: యూట్యూబ్‌ పై సునామీ దాడికి రంగం సిద్ధం.. ఫుల్ కిక్...

Sarkaru Vaari Paata Trailer: యూట్యూబ్‌ పై సునామీ దాడికి రంగం సిద్ధం.. ఫుల్ కిక్ లో మహేష్ ఫ్యాన్స్ !

Sarkaru Vaari Paata Trailer: ‘సర్కారు వారి పాట’ రికార్డుల మోత మోగించబోతుంది. యూట్యూబ్‌పై సూపర్ స్టార్‌ సునామీ దాడికి ముహూర్తం ఖరారైంది. సర్కారు వారి పాట ట్రైలర్‌ను మే 2న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. చిత్రంలో మొదట్నుంచీ ఒకానొక హైలెట్‌గా చెప్పుకుంటున్న తాళాల ఫైట్‌లోని ఓ స్టిల్‌ని విడుదల చేస్తూ, ట్రైలర్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు.

Sarkaru Vaari Paata Trailer
Sarkaru Vaari Paata Trailer

చిత్ర విడుదలకు ఇంకా రెండు వారాలే ఉండగా ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. త్వరలోనే మహేష్‌తో ఇంటర్వ్యూ ప్లాన్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సాగిన ట్రైలర్ రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వస్తోంది.

ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ట్రైలర్ ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది.

సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

Sarkaru Vaari Paata Trailer
Sarkaru Vaari Paata Trailer

ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version