CM Jagan: బీసీ తారక మంత్రం.. వెనుకబడిన తరగతులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం

CM Jagan: మా పార్టీ బీసీల పక్షపాతి. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీలకు పదవులిచ్చాం. కేబినెట్లో కీలక శాఖలిచ్చాం.. ఇలా వైసీపీ అధినేత జగన్ అన్ని వేదికల వద్ద నిత్యం చెప్పే మాటలివి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా బీసీలే ఉన్నారు. వారి అభిమానాన్ని చూరగొనడం ద్వారా ప్రభుత్వాన్ని పదిల పరుచుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే బీసీ తారక మంత్రం పఠిస్తున్నారు. […]

Written By: Dharma, Updated On : May 7, 2022 1:39 pm
Follow us on

CM Jagan: మా పార్టీ బీసీల పక్షపాతి. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీలకు పదవులిచ్చాం. కేబినెట్లో కీలక శాఖలిచ్చాం.. ఇలా వైసీపీ అధినేత జగన్ అన్ని వేదికల వద్ద నిత్యం చెప్పే మాటలివి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

Jagan

రాష్ట్ర జనాభాలో సగానికిపైగా బీసీలే ఉన్నారు. వారి అభిమానాన్ని చూరగొనడం ద్వారా ప్రభుత్వాన్ని పదిల పరుచుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే బీసీ తారక మంత్రం పఠిస్తున్నారు. ఇందుకు భారీ స్కెచ్ వేశారు. బీసీల అభ్యున్నతిని నవరత్నాల్లో మిక్సింగ్‌ చేశారు. ఐదారు కులాలకు పథకాలిచ్చి మొత్తం 137 కులాలకు అండగా నిలిచి.. ‘బీసీలకు బ్రహ్మరథం’ అంటూ కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి విభజిత రాష్ట్రంలో 137 బీసీ కులాలున్నాయి. గత ప్రభుత్వం వీటన్నింటికీ కలిపి 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. ఏటా రూ.1000 కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లను అందించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి స్వరూపాన్నే మార్చేసింది. ఏకంగా 52 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కానీ… వాటికి ప్రత్యేకంగా విధులు లేవు. నిధులూ లేవు.

Also Read: Best Cars in India: భారత కార్ల పరిశ్రమలో మరుపురాని పది పాపులర్ కార్లు ఇవీ

రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి కలిగే పథకాల్లో… తమ కులం వాళ్లు ఎందరో లెక్కించి, వారికి అది ప్రత్యేకంగా జరిగిన మేలుగా లెక్కించే బాధ్యతను కార్పొరేషన్లు తీసుకున్నాయి. ‘ఇది ఫలానా కార్పొరేషన్‌ ద్వారా జరిగిన లబ్ధి’గా ప్రభుత్వం పత్రికా ప్రకటనల్లో గొప్పగా చెప్పుకొంటుంది. అటు నవరత్నాలులో ప్రధాన్యమిస్తునే బీసీ కార్పొరేషన్‌ రెండింటి ద్వారా లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేస్తోంది. నిజానికి… బీసీ కార్పొరేషన్లకు ఒక్కరికి కూడా పథకాలను మంజూరు చేసే అధికారం లేదు. అంటే… ఇవి నామ్‌కే వాస్తే కార్పొరేషన్లు. రాష్ట్రంలో సుమారు 137 బీసీ కులాలున్నాయి. 2.14 కోట్ల మంది బీసీలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ… ‘నవ రత్నాలు’లో కేవలం ఐదు కులాలకు చెందిన 44 లక్షల జనాభాకు మాత్రమే ప్రత్యేకమైన పథకాలు అమలవుతున్నాయి. బీసీల్లోని రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, మత్స్యకారులు, చేనేత పని వారికి మాత్రమే ఇవి వర్తిస్తున్నాయి. అవి కూడా గతంలో అమలైన పథకాలే! మిగిలిన అన్ని కులాలకు మొండిచెయ్యే.

మత్స్యకారులకు భరోసాతో సరి

CM Jagan

గతంలో మత్స్యకారులకు పడవలు, వలలు, ఐస్‌ బాక్సులకు 90 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేవారు.
డీజిల్‌పై లీటరుకు రూ.6.50 సబ్సిడీ అందేది. చేపల వేటపై నిషేధం అమలయ్యే రెండు నెలలు రూ.4500 చొప్పున సహాయం చేసేవారు. ఇప్పుడు అవన్నీ రద్దు చేసి… మత్స్యాకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్నారు. డీజిల్‌ సబ్సిడీని లీటరుకు రూ.9కి పెంచారు. పెరిగిన డీజిల్‌ ధరతో పోల్చితే ఈ సబ్సిడీ పిసరంతే! ఇక… చేనేత కార్మికులకు చంద్రబాబు హయాంలో ముడి నూలు, రంగులను 75 శాతం సబ్సిడీతో అందించేవారు. మగ్గంపై పని చేయడం కుదరని వర్షాకాలంలో రూ.8వేల చొప్పున భృతిని ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ రద్దు చేసి సొంత మగ్గాలు ఉన్న వారికి మాత్రం ‘నేతన్న నేస్తం’ కింద రూ.24వేలు ఇస్తున్నారు.

ముందున్న ప్రభుత్వాలవే..
కాంగ్రెస్‌ హయాంలో బీసీ కులాలకు ఫెడరేషన్లు ప్రారంభమయ్యాయి. వాటిని టీడీపీ సర్కారు కార్పొరేషన్‌లుగా మార్చింది. రాష్ట్రంలో ఉన్న 137 బీసీ కులాలను గుర్తించి… అర్హులైన పేదలందరికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, సగర, వడ్డెర, ఉప్పర, కృష్ణ బలిజ, వాల్మీకి, కుమ్మరి, భట్రాజ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చారు. కొత్తగా… మేదర, విశ్వబ్రాహ్మణ, కల్లుగీత కార్మికులకు ఫైనాన్స్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు యాదవ, తూర్పు కాపు/గాజుల కాపు, కొప్పుల వెలమ/పోలినాటి వెలమ, కురుబ/కురుమ, వన్యకుల క్షత్రియ, కళింగ, గవర, చేనేత, మత్స్యకారులు, గాండ్ల, ముదిరాజ్‌లకు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఏటా ఈ కార్పొరేషన్ల ద్వారా సుమారు 60 వేల మంది బీసీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించారు. 2018-19 బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు భారీగా పెంచారు. చేనేత సంక్షేమానికి అంతకుముందు కంటే పదిరెట్లు, రజకులకు వందరెట్లు, దూదేకుల కులానికి 20 రెట్లు, నాయీబ్రాహ్మణులకు 35 రెట్లు కేటాయింపులు పెంచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారిపోయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లన్నింటినీ రద్దు చేశారు. మళ్లీ అదే పేర్లతో కొత్తగా అన్నీ కులాలకు ఫైనాన్స్‌ కార్పొరేషన్లు పెట్టారు. వాటి ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులూ కేటాయించడంలేదు. అన్నింటికీ నవరత్నాలతో లింకు చేసి వాటిలో లబ్ధిపొందిన వారినే సెపరేట్ చేసి బీసీల అభ్యున్నతి అన్న పదాన్ని జోడించి ప్రచారం చేసుకుంటున్నారు.

Also Read:BJP Congress Attack: బీజేపీ, కాంగ్రెస్ అటాక్.. కేసీఆర్ నిర్ణయం ఎటు వైపు?

Recommended Videos:

Tags