Sarkaru Vaari Paata Trailer: ‘సర్కారు వారి పాట’ రికార్డుల మోత మోగించబోతుంది. యూట్యూబ్‌పై సూపర్ స్టార్ సునామీ దాడికి ముహూర్తం ఖరారైంది. సర్కారు వారి పాట ట్రైలర్‌ను మే 2న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. చిత్రంలో మొదట్నుంచీ ఒకానొక హైలెట్‌గా చెప్పుకుంటున్న తాళాల ఫైట్‌లోని ఓ స్టిల్‌ని విడుదల చేస్తూ, ట్రైలర్ డేట్‌ని అనౌన్స్ చేశారు.

చిత్ర విడుదలకు ఇంకా రెండు వారాలే ఉండగా ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. త్వరలోనే మహేష్‌తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు సాగిన ట్రైలర్ రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ట్రైలర్ ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది.
సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.