https://oktelugu.com/

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా కూడా లీక్ అవ్వబోతుందా??.. ఆందోళనలో మేకర్స్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సుమారు రెండేళ్ల నుండి తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూడడం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన హీరో గా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత కోవిద్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 27, 2022 / 08:33 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సుమారు రెండేళ్ల నుండి తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూడడం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన హీరో గా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత కోవిద్ రావడం తో మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా పడుతూ ఆలస్యం అయ్యింది..ఇప్పుడు పరిస్థితులు అన్ని చక్కబడడం తో ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు మరియు టీజర్ అభిమానులను ఉర్రూతలు ఊగించింది అనే చెప్పాలి.

    Sarkaru Vaari Paata

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా మేకర్స్ కి ఇప్పుడు లీకుల భయం మొదలైంది..ఇటీవలే విడుదల అయినా పాటలు అన్ని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేసే ముందే సోషల్ మీడియా లో ఈ చిత్రం యూనిట్ లో ఉన్న కొంతమంది, మేకర్స్ కళ్లుకప్పి లీక్ చేసిన ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది..స్వయంగా ఆ సినిమా సంగీత దర్శకుడు థమన్ ఎంతో బాధ పడుతూ ట్విట్టర్ లో మాట్లాడిన కొన్ని మాటలు చూసి మహేష్ బాబు అభిమానులు చాలా ఫీల్ అయ్యారు.

    Also Read: TRS Plenary: కేసీఆర్‌ సేఫ్‌ గేమ్‌… ప్రత్యర్థుల పేరెత్తని గులాబీ అధినేత

    మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రతలు తీసుకుంటాము అని ఆ చిత్ర బృందం అభిమానులకు క్షమాపణ చెప్తూ అప్పట్లో ట్వీట్లు కూడా వేశారు..కానీ అప్పట్లో ఇదే మైత్రి మూవీ మేకర్స్ నుండి విడుదల అయినా పుష్ప సినిమాకి..రిలీజ్ కి ముందే ఎన్నో సన్నివేశాలు లీక్ అవ్వడం మనకి తెలిసిందే..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా సన్నివేశాలు కూడా అలాగే లీక్ అవుతుంది ఏమో అని అభిమానులు భయపడుతున్నారు.

    Sarkaru Vaari Paata

    కానీ పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగబోదు అని..గతం లో సాంగ్స్ లీక్ అవ్వడానికి కారకులు అయినా వారిపై కఠిన చర్యలు తీసుకున్నాము అని..కాబట్టి ఈసారి అలాంటి తప్పులు రిపీట్ అవ్వవు అని మైత్రి మూవీ మేకర్స్ వారు అభిమానులకు భరోసా ఇస్తున్నారు..కానీ పుష్ప సినిమా లీక్ అయినప్పుడు కూడా ఇలాగే చెప్పారు..కానీ సినిమా విడుదల అయ్యే వరుకు ఆ చిత్రం నుండి ఎదో ఒక్క సన్నివేశం సోషల్ మీడియా లో లీక్ అవుతూనే ఉంది అని, మీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు అంటూ మహేష్ బాబు అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ వారిని ట్యాగ్ చేసి తిడుతున్నారు..చూడాలిమరి ఈసారి అయినా ఇచ్చిన మాటకి కట్టుబడి జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అని..ఒక్కవేల ఈ సినిమా నుండి మరోసారి ఏదైనా లీక్ అయితే మాత్రం అభిమానుల తాకిడి ని మైత్రి మూవీ మేకర్స్ వారు తట్టుకోలేరు అని చెప్పొచ్చు.

    Also Read:Oil Price: మంట రేపుతున్న వంటనూనెలు.. ధర పెరుగుదలతో ఏపీ ప్రజలు విలవిల

    Recommended Videos:

    Tags