https://oktelugu.com/

Sardar 2 Movie Teaser : కార్తీ ‘సర్దార్ 2’ మూవీ టీజర్ వచ్చేసింది..విలన్ విషయంలో ట్విస్ట్ అదుర్స్!

Sardar 2 Movie Teaser : సర్దార్ 2 చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేసారు మేకర్స్. మొదటి భాగం లో లాగానే ఇందులో కూడా కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. మొదటి భాగం లో 'సర్దార్' క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చే క్యారక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది.

Written By: , Updated On : March 31, 2025 / 09:00 PM IST
Sardar 2 Movie Teaser

Sardar 2 Movie Teaser

Follow us on

Sardar 2 Movie Teaser : తమిళ హీరో కార్తీ(Karthi Sivakumar) నటించిన సినిమాలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘సర్దార్'(Sardar Movie). 2022 వ సంవత్సరం లో దీపావళి కానుకగా తెలుగు , తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు కమర్షియల్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెండు భాషలకు కలిపి దాదాపుగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘సర్దార్ 2′(Sardar 2 Movie) త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేసారు మేకర్స్. మొదటి భాగం లో లాగానే ఇందులో కూడా కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. మొదటి భాగం లో ‘సర్దార్’ క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చే క్యారక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. కానీ పార్ట్ 2 మాత్రం సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఈ క్యారక్టర్ ఉంటుందని ఈరోజు విడుదలైన టీజర్ ని చూస్తే తెలుస్తుంది.

Also Read : తల్లి కారణంగానే శ్రీలీల సినీ కెరీర్ నాశనం అవుతుందా..?

ఇందులో చైనా దేశంలో రహస్యం గా ఒక దీవిలో తలదాచుకున్నట్టు చూపించారు. ఆయన్ని వెట్టుకుంటూ, తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలకు వచ్చిన వారితో ఫైటింగ్ చేసి అందరినీ చంపేస్తాడు హీరో. అందులో ఒక విలన్ చనిపోయే ముందు ‘ఇదంతా మాతోనే ముగిసిపోతుందని అనుకోకు. త్వరలోనే బ్లాక్ డాగర్ వస్తున్నాడు, మీ దేశాన్ని ముంచేస్తాడు, దమ్ముంటే వాడిని ఎదురుకొని చూడు అని అంటాడు. ఆ బ్లాక్ డాగర్ క్యారక్టర్ ని ఎస్ జె సూర్య(SJ Surya) చేస్తున్నాడు. టీజర్ ని చూస్తే రొటీన్ సబ్జెక్టు లాగానే అనిపిస్తుంది, కానీ చాలా రిచ్ గా, అద్భుతమైన క్వాలిటీ తో ఈ సినిమాని తీసినట్టు తెలుస్తుంది. PS మిత్రాన్(PS Mithran) సినిమాలు మినిమం రేంజ్ గ్యారంటీ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి, సర్దార్ 2 కూడా మొదటి భాగం లాగానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ఫ్యాన్స్.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని అప్పట్లో మిత్రాన్ అక్కినేని అఖిల్ తో చేయాలని అనుకున్నాడట. డ్యూయల్ రోల్ లో యంగ్ కార్తీ క్యారక్టర్ ని అఖిల్, అదే విధంగా ముసలి కార్తీ క్యారక్టర్ లో నాగార్జున చేద్దామని అనుకున్నారు. కానీ నాగార్జున క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది, అఖిల్ డామినేట్ అయిపోతాడని ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు. అది మెల్లగా కార్తీ చేతుల్లోకి వెళ్ళింది. మొదటి భాగం లో నీటి పై పోరాటం చేసారు, రెండవ భాగం లో దేనిపై పోరాటం చేస్తారు అనేది ప్రస్తుతానికి అయితే స్పష్టంగా అర్థం కాలేదు. మొదటి భాగం లో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించగా, రెండవ భాగం లో మాళవిక మోహనన్ అని అనిపిస్తుంది. సీక్వెల్ అన్నారు, అంటే కచ్చితంగా ఆ పాత్రకు కొనసాగింపు ఉండాలి కదా, మధ్యలో ఇదేంటి అని కొంతమంది అభిమానులు అనుమానిస్తున్నారు.

Also Read : ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి..యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ ట్రైలర్!

Sardar 2 (Telugu) - Prologue | Karthi | SJ Suryah | PS Mithran | Sam CS