Akkada Ammayi Ikkada Abbayi : బుల్లితెర మీద యాంకరింగ్ రంగం లో తిరుగులేని స్టార్ గా, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించిన ప్రదీప్(Pradeep Machiraju), ఈమధ్య కాలంలో ఏ టీవీ ఛానల్ లో కూడా కనిపించకపోవడంతో, అసలు ప్రదీప్ ఏమయ్యాడు?, యాంకరింగ్ పూర్తిగా మానేశాడా? అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమా కోసమే యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్టు ఆ తర్వాత అర్థమైంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా టైటిల్ ని వాడుకున్నందుకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ నుండి మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ, ప్రదీప్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు. ఈ చిత్రంలో ఇన్ స్టాగ్రామ్ బ్యూటీ, ఢీ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. నేడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు.
Also Read : ప్రభాస్ ఆఫీస్ PRO పై పోలీస్ కేసు నమోదు..కారణం ఏమిటంటే!
ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత అర్థమైనది ఏమిటంటే, ప్రదీప్ ఎదో టైం పాస్ కోసం హీరో గా సినిమాలు చేయడం లేదు, చాలా పెద్ద రేంజ్ కి వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నాడని అర్థం అయ్యింది. కథ కూడా చాలా కొత్తగా ఉంది. కథ విషయానికి వస్తే అమెరికా లో స్థిరపడిన ఒక సివిల్ ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం కేవలం 61 మంది జనాలు ఉన్న గ్రామం లోకి వస్తాడు. ఆ 61 మందిలో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయితో హీరో కి పరిచయం ఏర్పడడం, వాళ్లిద్దరూ ప్రేమలో పడడం వంటివి షరామామూలే. ఈ ఊరిలో ఉన్నన్ని రోజులు హీరోకి ఎదురైనా సంఘటనలే సినిమా. ఇందులో కమెడియన్ సత్య, గెటప్ శ్రీను, బ్రహ్మానందం వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.
జనాలు ఈమధ్య కొత్త తరహా కాన్సెప్ట్స్ ని బాగా ఆదరిస్తుండడంతో, ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నాడు యాంకర్ ప్రదీప్. ఏప్రిల్ 11 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రదీప్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిల్చి, హీరో గా ఆయనకు స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి. హీరో గా ఆయన నటించిన మొదటి చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లోని ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ పాటలు సోషల్ మీడియా లో మారుమోగుతూనే ఉన్నాయి. ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ లో ఆ రేంజ్ పాట లేకపోయినా, పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ పాట ఉంది, చూడాలి మరి ఓపెనింగ్స్ ఏ మేరకు రాబోతుందో అనేది.
