https://oktelugu.com/

Srileela : తల్లి కారణంగానే శ్రీలీల సినీ కెరీర్ నాశనం అవుతుందా..?

Srileela: నటన పరంగా మొదట్లో విమర్శలు వినిపించాయి కానీ, 'భగవంత్ కేసరి' చిత్రంతో నటిగా కూడా ఆమె అద్భుతంగా రాణించగలదు అని నిరూపించుకుంది. కానీ ఈమె కెరీర్ లో 8 సినిమాలు చేస్తే అందులో కేవలం మూడు సూపర్ హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. మొదటి చిత్రం పెళ్లి సందడి సూపర్ హిట్ కాగా, రెండా చిత్రం ధమాకా కమర్షియల్ గా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అనొచ్చు.

Written By: , Updated On : March 31, 2025 / 08:51 PM IST
Srileela

Srileela

Follow us on

Srileela : టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న కుర్ర హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శ్రీలీల(Heroine Srileela) కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. కేవలం తన డ్యాన్స్ తో థియేటర్స్ కి ఆడియన్స్ ని లక్షలాదిగా తరలించే సత్తా ఉన్న అమ్మాయి ఈమె. నటన పరంగా మొదట్లో విమర్శలు వినిపించాయి కానీ, ‘భగవంత్ కేసరి’ చిత్రంతో నటిగా కూడా ఆమె అద్భుతంగా రాణించగలదు అని నిరూపించుకుంది. కానీ ఈమె కెరీర్ లో 8 సినిమాలు చేస్తే అందులో కేవలం మూడు సూపర్ హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. మొదటి చిత్రం పెళ్లి సందడి సూపర్ హిట్ కాగా, రెండా చిత్రం ధమాకా కమర్షియల్ గా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

Also Read : చావా’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఆడియన్స్ కి ఇక పండగే!

శ్రీలీల కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయకుండా, కేవలం డ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం విడుదలైంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ లో శ్రీలీల కంటే ఆమె తల్లి ఎక్కువగా చొరవ తీసుకుంటుండట. స్టోరీ ఉందా లేదా అనేది తర్వాత సంగతి. ఆమె ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ కి నిర్మాతలు ఓకే చేప్తే ఆ మరుసటి క్షణంలోనే ఆమె తన కూతురితో సినిమా చేసేందుకు ఒప్పుకుంటుంది. అమ్మ నుండి అనుమతి వచ్చిన తర్వాతనే శ్రీలీల ఒక సినిమాకు సంతకం చేస్తుందట. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రెండు నుండి రెండున్నర కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది.

ఇలా స్క్రిప్ట్ ని సరిగా ఎంచుకోకుండా ముందుకు వెళ్తుండడం వల్లే శ్రీలీల కు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి అనేది వీళ్ళ సిద్ధాంతం ఏమో, హీరోయిన్ కెరీర్ 5 నుండి ఆరేళ్ళ వరకు మాత్రమే ఉంటుంది. ఇంతలోపు కావాల్సినంత సంపాదించుకోవాలి అనేది శ్రీలీల టార్గెట్ ఏమో, అందుకే ఆమె ఇలాంటి సినిమాలు చేస్తుందంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇదే పద్దతి ని అనుసరిస్తూ వెళ్తే శ్రీలీల కెరీర్ కచ్చితంగా డేంజర్ లో పడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక హీరోయిన్ కెరీర్ నిలబడాలంటే కేవలం అందం, డ్యాన్స్ ఒక్కట్టే ఉంటే సరిపోదు, యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండాలి. అందుకే పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోలు ఈమెతో కలిసి సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్. రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో రెండు సినిమాలకు సంతకం చేసింది. ఈ రెండు సినిమాలకు కూడా ఆమె ముందుగా స్క్రిప్ట్ ని వినలేదట.