Devara Movie in Japan
Devara in Japan : #RRR వంటి వెండితెర అద్భుతం తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర’ (Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాకుండా, ఓటీటీ లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషలకు కలిపి 9 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎగబడి ఈ సినిమాని చూడడం తో అన్ని రోజులు ట్రెండ్ అయ్యింది అనొచ్చు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని జపాన్ దేశం లో గ్రాండ్ గా విడుదల చేసారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్ లో మంచి క్రేజ్ ఉంది.
Also Read : కార్తీ ‘సర్దార్ 2’ మూవీ టీజర్ వచ్చేసింది..విలన్ విషయంలో ట్విస్ట్ అదుర్స్!
#RRR లాంటి సినిమా తర్వాత విడుదల అవుతున్న చిత్రం కాబట్టి కచ్చితంగా జపాన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఓపెనింగ్స్ దగ్గర నుండే యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ స్వయంగా జపాన్ కి వెళ్లి ప్రమోషన్స్ చేసినప్పటికీ కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్(Rebel Star Prabhas), రామ్ చరణ్(Global Star Ram Charan) సినిమాలకు దరిదాపుల్లోకి కూడా ఈ చిత్రం అక్కడ రాలేకపోయింది. కానీ రెండవ రోజు నుండి క్రమంగా పుంజుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండేలా అనిపిస్తుంది. #RRR చిత్రం జపాన్ లో సంవత్సరం పాటు విరామం లేకుండా థియేటర్స్ లో ఆడింది. ‘దేవర’ చిత్రానికి ఆ రేంజ్ థియేట్రికల్ రన్ వచ్చినా రాకపోయినా, ఇండియన్ సినిమాలలో ది బెస్ట్ రన్ ని సొంతం చేసుకుంటుంది అని మాత్రం చెప్పొచ్చు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ఈ చిత్రానికి మూడు రోజుల్లో 15 మిల్లియన్లకు పైగా జపనీస్ డాలర్లు వచ్చాయి. ‘రంగస్థలం’ చిత్రం తో పోలిస్తే ఇది తక్కువే, కానీ సోమవారం రోజు కూడా వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. ఇంత స్టడీ రన్ గతంలో #RRR కి మాత్రమే మనమంతా చూసాము. ఇప్పుడు దేవర కూడా అలాంటి రన్ ని చూస్తున్నాము. మరో రెండు వారాలు ఇంతే స్టడీ రన్ ని కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం నాన్ #RRR రికార్డుని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ మూవీ చేస్తున్నాడు. ఆగస్టు 14 న ఈ సినిమా మన ముందుకు రాబోతుంది.
Also Read : చావా’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఆడియన్స్ కి ఇక పండగే!