
Varalaxmi- Sarathkumar: సౌత్ ఇండియా లో మేల్ క్యారెక్టర్స్ ని డామినేట్ చేసే సత్తా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు,వారిలో ఒకరే వరలక్ష్మి శరత్ కుమార్.ప్రముఖ తమిళ స్టార్ హీరో శరత్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా కూడా తన సొంత టాలెంట్ తో నేడు ఈ రేంజ్ కి వచ్చింది.తమిళం ‘పోడాపోడి’ అనే చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా సక్సెస్ సాధించడంతో వరుసగా హీరోయిన్ రోల్స్ చేసే అవకాశం వచ్చింది.
కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు, దీనితో ఆమె హీరోయిన్ రోల్స్ నుండి విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యింది.’పందెం కోడి 2 ‘ సినిమాతో ప్రారంభమైన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో విలన్ రోల్స్ చేసి ఇప్పుడు సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న లేడీ విలన్ గా ఎదిగింది.
తెలుగు లో ఈమె ‘క్రాక్’ సినిమాలో పోషించిన జయమ్మ పాత్రకి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే, రీసెంట్ గా విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి కూడా ఆమె పాత్ర హైలైట్ గా నిల్చింది.ఇక రీసెంట్ గానే ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కొండ్రాల్ పావమ్’ రిలీజైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ లో ఫంక్షన్ లో ఆమె తండ్రి శరత్ కుమార్ వరలక్ష్మి గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘వరలక్ష్మి ని అందరూ విజయశాంతి తో పోలుస్తున్నారు.నిజమే ఆమె సినిమాల్లోనే కాదు, నిజజీవితం లో కూడా విజయశాంతి లాంటిదే, ఒకసారి ఆమె తన కారు ని గుద్దిన ఇద్దరు అబ్బాయిలను చితకబాది జైలుకెళ్లి కూర్చుంది, నా కూతురుతో అంత తేలికగా కాదు..ఆమె ఫైర్ బ్రాండ్’ అంటూ ఈ సందర్భంగా తెలిపాడు.