Homeఎంటర్టైన్మెంట్Sharath Babu : చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన శరత్ బాబు..!

Sharath Babu : చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన శరత్ బాబు..!

Sharath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మే 22 సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురయ్యారు. ఆయన శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రధాన అవయవాలు దెబ్బతిని మరణించారు. 71ఏళ్ల శరత్ బాబు మృతిపై చిత్ర ప్రముఖులు, అభిమానులు, రాజకీయవేత్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు. 

 
శరత్ బాబుకు వారసులు లేరు. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. మొదటి భార్య రమాప్రభతో కానీ రెండో భార్యతో కానీ పిల్లల్ని కనలేదు. ఇద్దరితో శరత్ బాబు విడిపోయారు. అయితే శరత్ బాబుకు ఒక కోరిక ఉంది. అది నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. తిరుపతికి సమీపంలో గల హార్స్లీ హిల్స్ శరత్ బాబుకు ఇష్టమైన ప్రదేశం అట. అక్కడ ఇల్లు కట్టుకొని శేష జీవితం గడిపేద్దాం అనుకున్నాడట. ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడట. చివరికి పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో శరత్ బాబు చివరి కోరిక నెరవేరలేదు. 
 
శరత్ బాబు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. చదువు పూర్తి కాగానే మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. చక్కని రూపం కలిగిన శరత్ బాబుకు హీరోగా ఛాన్స్ వచ్చింది. 1973లో విడుదలైన రామరాజ్యం చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. శరత్ బాబు 250కి పైగా చిత్రాల్లో నటించారు. 
 
వకీల్ సాబ్ మూవీలో ఆయన లాయర్ పాత్ర చేశారు. శరత్ బాబు చివరి చిత్రం మళ్ళీ పెళ్లి. నరేష్-పవిత్ర లోకేష్ జంటగా నటించారు. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను ఆయన చేశారు. మళ్ళీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. దేశ ప్రధానితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు. నటుడు నరేష్ ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మళ్ళీ పెళ్లి చిత్ర  యూనిట్ ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. 
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version