https://oktelugu.com/

Raviteja – Mahesh Babu : రవితేజ కోసం మహేష్ బాబు అలాంటి పని చేయబోతున్నాడా..!

ఈ చిత్రానికి వంశీ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా, 'ది కాశ్మీర్ ఫైల్స్' నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 23, 2023 / 09:46 AM IST
    Follow us on

    Raviteja – Mahesh Babu : మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’.’ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న రవితేజ నుండి  రీసెంట్ గా విడుదలైన  ‘రావణాసుర’ చిత్రం ట్రేడ్ ని బాగా నిరాశపరిచింది. కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ ఈ చిత్రం ఒక సెక్షన్ ఆడియన్స్ కి బాగా నచ్చింది.దీనితో ఆడియన్స్ లో ‘ధమాకా’ చిత్రం నుండి ఒక సరికొత్త రవితేజ ని చూస్తున్నాము అనే అనుభూతి కలిగింది.

    ఇప్పుడు టైగర్ నాగేశ్వర రావు తో ఆయన ఆడియన్స్ లో ఎదో కొత్త తరహా సినిమా చూడబోతున్నాము అని ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే ఒక క్లారిటీ కి వచ్చేసారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కూడా త్వరలోనే విడుదుల చెయ్యబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రాన్ని తెలుగు తో పాటుగా ఇతర ప్రాంతీయ బాషలలో కూడా విడుదల చేస్తున్నారు.

    అందుకే టీజర్ కూడా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుందట. ఈ టీజర్ ప్రారంభానికి ముందు ఒక వాయిస్ ఓవర్ అవసరం కచ్చితంగా ఉంటుందట.రీసెంట్ గానే ఈ టీజర్ కి సంబంధించిన హిందీ వాయిస్ ఓవర్ జాన్ అబ్రహం అందించాడు, అలాగే తమిళ్ వెర్షన్ టీజర్ కి కార్తీ, కన్నడ వెర్షన్ టీజర్ కి శివ రాజ్ కుమార్ మరియు మలయాళం వెర్షన్ టీజర్ కి దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ అందించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ టీజర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

    ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తన తోటి స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మరియు చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ కోసం మరోసారి తన గాత్రం అందించబోతున్నాడు. ఈ చిత్రానికి వంశీ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.