Santoor Ad Actress : అదృష్టం బాగా కలిసి వచ్చి ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కేవలం ఒకే ఒక్క హిట్టుతో వీళ్లు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని అదృష్టం కూడా బాగా కలిసి వచ్చి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కానీ ఆమె తన కెరియర్ లో ఎన్నో కష్టాలను అనుభవించింది. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో మాడల్ గా చేసింది. ఒకప్పుడు బుల్లితెర మీద సంతూర్ మమ్మీగా బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ పాన్ ఇండియా స్టార్ హీరోలతో కలిసి నటించడం సామాజిక మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఈ బ్యూటీ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి త్రిప్తి దిమ్రి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో త్రిప్తి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అంతకుముందు ఈ బ్యూటీ పలు సినిమాలలో నటించిన కూడా యానిమల్ సినిమాతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది.
Also Read : వామ్మో స్రవంతి అదరగొడుతుంది కదా. మరి ఏంటమ్మా ఆ అందాల ఆరబోత..
యానిమ ల్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న యానిమల్ పార్క్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా చేస్తుంది. అలాగే ఈ చిన్నది ప్రభాస్, సందీప్ కాంబినేషన్లో రాబోయే స్పిరిట్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించే అవకాశం అందుకుంది. ఈమెకు నటనపై బాగా ఆసక్తి పెరగడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి దినేష్ దిమ్రీ. రామ్ లీలా ఉత్సవాలలో ఒకప్పుడు ఆయన పౌరాణిక పాత్రలలో నటించేవారు. ఈ విధంగా తండ్రిని చూసిన త్రిప్తి తను కూడా నటిగా మారాలని అనుకుంది. ఈ క్రమంలో మోడలింగ్ రంగంలో తన కెరియర్ మొదలుపెట్టి కొన్ని కమర్షియల్ ప్రకటనల్లో కూడా నటించింది. ముఖ్యంగా ఈ బ్యూటీ సంతూర్ యాడ్ లో సంతూర్ మమ్మీగా బాగా గుర్తింప తెచ్చుకోండి.
గుడ్ ఎర్త్, పాండ్స్, హిమాలయాల వంటి పలు యాడ్స్ లో నటించి బాగా ఫేమస్ అయ్యింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి 2017లో రిలీజ్ అయిన పోస్టర్ బాయ్స్ అనే కామెడీ సినిమాతో త్రిప్తి తండ్రి ఇచ్చింది. ఇక అదే ఏడాది లైలా మజ్ను అనే ప్రేమ కథ సినిమాలో ప్రధాన పాత్రలో పోషించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్న స్థాయిలో రాణించ లేకపోయినా కూడా ఈమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో 2019లో రిలీజ్ అయిన బుల్బుల్ అనే మిస్టరీ డ్రామా తో ఈమెకు ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. యానిమల్ సినిమాతో ఈమె సినిమా కెరియర్ మలుపు తిరిగింది.