Dimple Hayathi: మన టాలీవుడ్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి లెజండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు దాసరి నారాయణ రావు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, మెగాస్టార్ చిరంజీవి, ఇలా దాదాపుగా అందరి హీరోలతో ఆయన సినిమాలు చేసి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ప్రస్తుత తరం లో రాజమౌళి కి ఎలాంటి పేరుందో, ఆరోజుల్లో దాసరి నారాయణరావు కి కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు ఉండేవి. కేవలం సినిమాలు తీయడమే కాదు, ఇండస్ట్రీ కి ఏ చిన్న సమస్య వచ్చినా, ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలు తీసుకొని, ఆ సమస్యని పరిష్కరించే వరకు నిద్రపోని గొప్ప మనిషి ఆయన. అలాంటి లెజెండ్ ఈరోజు మన మధ్య లేకపోవడం కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టమే. అయితే అలాంటి లెజెండ్ కి ఇండస్ట్రీ లో వారసులు లేకపోవడం దురదృష్టకరం.
ఆయన తనయుడు దాసరి అరుణ్ కుమార్ అప్పట్లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. నాలుగైదు సినిమాలు కూడా చేసాడు, కానీ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఏమి చేస్తున్నాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ దాసరి నారాయణరావు మనవరాలు మాత్రం ఇండస్ట్రీ లో ప్రస్తుతం క్రేజీ యంగ్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె మరెవరో కాదు, డింపుల్ హయాతి. ఈమె అమ్మగారికి తండ్రి దాసరి నారాయణ రావు కి స్వయానా కజిన్ అవుతాడట. ఈ విషయాన్నీ ఆమె రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తన తాత తో తనకు ఉన్నటువంటి అనుభందం గురించి కూడా ఆమె మాట్లాడింది. మా తాత గారు చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడని, ఒక స్క్రిప్ట్ ని కూడా లాక్ చేసాడని, ఆ సినిమా పేరు కల్కి అంటూ చెప్పుకొచ్చింది డింపుల్ హయతి.
ఈమె దాసరి కి మనవరాలు అనే విషయం తెలుసుకున్న నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇప్పటి వరకు ఈమె టాలీవుడ్ లో 8 సినిమాలు చేసింది. కానీ కమర్షియల్ గా ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. రీసెంట్ గానే ఈమె హీరోయిన్ గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో రావడం లేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇకపోతే డింపుల్ హయతి తన తాత దాసరి గురించి మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించిన వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాం చూడండి.
