Sandeep Vanga Counter On RGV: నిన్నటి తరం ఆడియన్స్ కి రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఎలాగో, నేటి తరం ఆడియన్స్ కి సందీప్ వంగ(Sandeep Reddy Vanga) అలా అన్నమాట. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మటు సినిమాలకు, లవ్ స్టోరీస్ కి బిన్నంగా, ఒక కొత్త ప్రయత్నంగా ఉండేవి. అలాంటి సమయం లోనే శివ, గాయం, సత్య, కంపెనీ, రంగీలా, సర్కార్ వంటి సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఆయన బుర్ర అలా ఆలోచించేది. సందీప్ వంగ కూడా అంతే, ఒకే మూస లో వెళ్తున్న ఇండియన్ సినిమాని తనదైన స్టైల్ లో కొత్త మార్గం లో నడిచేలా చేసాడు. తెలుగు ఆడియన్స్ ఆయనకు ఎంత వరకు కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ, బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. సందీప్ వంగ సినిమా అంటే ఇప్పుడు ఒక బ్రాండ్.
అయితే వీళ్లిద్దరి సినిమాలు ఒక ఎత్తు అయితే, వీళ్లిద్దరు ఇచ్చే ఇంటర్వ్యూస్ మరో ఎత్తు. వీళ్ళు చెప్పే సమాదానాలు చాలా ఆసక్తికరంగా, కొత్తగా, అసలు ఇలా కూడా ఆలోచిస్తారా అనేలా అనిపిస్తాయి. సందీప్ వంగ ఇంటర్వ్యూస్ అయితే మాట్లాడుతున్నప్పటికీ కూడా కొడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గానే జీ5 యాప్ లో మొదలైన జయమ్ము నిశ్చయ్యమ్మురా టాక్ షో కి విచ్చేశారు. ఈ టాక్ షో కి జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మూడు ఎపిసోడ్స్ ని పూర్తి చేసాడు. ఈ మూడు ఎపిసోడ్స్ లో జగపతి బాబు బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటే, ఈ ఎపిసోడ్ లో మాత్రం మరోలా ఉంది. చాలా మెతకపడ్డాడు అనిపించింది. వీళ్ళతో మాట్లాడితే ఎక్కడ రివర్స్ పంచులు మన మీద పడుతాయేమో అని ఆయన భయపడ్డడా ఏమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.
అయితే ఎపిసోడ్ మొదలు అవ్వగానే జగపతి బాబు మాట్లాడుతూ ‘ఇద్దరూ ఇద్దరే. ముక్కు సూటి మనుషులు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ’ అని అంటాడు. ‘నా సెల్ఫ్ రెస్పెక్ట్ సంగతి పక్కన పెడితే సందీప్ వంగ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలాంటిదంటే, అవతలి వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపేసేలాగా ఉంటుంది. బాలీవుడ్ లో రాజీవ్ మసంద్ అని ఒక క్రిటిక్ 30 సంవత్సరాల నుండి ఉన్నాడు. అతన్ని చాలా సింపుల్ గా ఫ్యాట్ సో అనేశాడు. ఇన్నేళ్లు పాపం అతను సంపాదించుకున్న గౌరవం మొత్తం ఒక్కే ఒక్క మాట తో చంపేశాడు’ అంటూ రామ్ గోపాల్ వర్మ అంటాడు. అప్పుడు సందీప్ వంగ సమాధానం చెప్తూ ‘సార్..నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నిజమే కానీ, మరీ మీ అంత పిచ్చి రెస్పెక్ట్ మాత్రం కాదు’ అని అంటాడు. ఇలా ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా బోల్డ్ గా, హాట్ గా సాగిపోయింది.