Sandeep Reddy Vanga Rejected Actors: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలా మంది దర్శకులు వాళ్ళకంటు ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు మొదటి సినిమాతోనే సంచలనాన్ని సృష్టించాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే తన మొదటి సినిమా విషయంలో చాలామంది హీరోలు తనను రిజెక్ట్ చేశారని కొంతమంది హీరోయిన్స్ సైతం తనను పట్టించుకోలేదని చాలా సందర్భాల్లో సందీప్ రెడ్డివంగ చెప్పాడు.
ఇప్పటివరకు తను చేసింది మూడు సినిమాలే అయినప్పటికి అతన్ని చాలామంది హీరోలు రిజెక్ట్ చేశారు. మొదట అర్జున్ రెడ్డి కథని శర్వానంద్ దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో శర్వానంద్ ఈ సినిమాను యాక్సెప్ట్ చేయలేదట. ఇక అతని తర్వాత ఈ సినిమాను మంచు మనోజ్ తో కూడా చేయాలనుకున్నారట.
కానీ మనోజ్ సైతం ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఎట్టకేలకు విజయ్ దేవరకొండ తో ఈ సినిమా అయితే చేశాడు. సినిమా సూపర్ సక్సెస్ అయింది ఇదే సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేసే సమయంలో అక్కడ రణ్వీర్ సింగ్ తో ఈ సినిమాని చేస్తే బాగుంటుందని అనుకున్నారట. అలాగే ఈ సినిమాలో మొదట కృతి సనన్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ రన్వీర్ సింగ్, కృతి సనన్ ఇద్దరు మొదట ఈ సినిమాకి ఓకే చెప్పి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట.
ఇక షాహిద్ కపూర్ తో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అనిమల్ సినిమా విషయంలో కూడా ఆయన పలువురు స్టార్ హీరోలతో చర్చలైతే జరిపాడు… అయితే అవేవి వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ వెళ్లి రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఈ సినిమా చేసే సక్సెస్ ని సాధించాడు… మొత్తానితే ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు…