Sandeep Reddy Vanga Angry Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి నటుడు మరొకరు లేరు అనేది వాస్తవం. బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి మెప్పిస్తూ వస్తున్నాడు. గత సంవత్సరం సలార్, కల్కి లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు మరోసారి ఈ సంవత్సరం చివరన రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న వాడవుతాడు. ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ఫౌజీ సినిమా ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నవాడవుతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్లో ఉన్న ప్రభాస్ గత కొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదట. మరి స్పిరిట్ సినిమా షూటింగ్ ను తొందర్లోనే స్టార్ట్ చేయాలని చూస్తున్నా ప్రభాస్ ఫౌజీ సినిమా పూర్తవ్వకుండా స్పిరిట్ కి డేట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు…
Also Read: అమరావతికి’ నిధుల వరద.. సిఆర్డిఏ సంచలన నిర్ణయం!
మరి ఇలాంటి క్రమంలో ఫౌజీ సినిమాకి మరొక 50 రోజులపాటు డేట్స్ కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందట. మరి ప్రభాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 రోజులు ఫౌజీ సినిమా మీదనే తన డేట్స్ ని కేటాయించి షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట…
ఇది అయిపోతే ఇక స్పిరిట్ సినిమా కోసం మేకవర్లో బిజీ కానున్నాడు. ఇక మొత్తానికైతే స్పిరిట్ సినిమా వచ్చి ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. సందీప్ రెడ్డివంగా ఈ సినిమా కోసం ఇప్పటికి రెండు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు.
రోజు రోజుకి ఈ మూవీ షూట్ లేయవుతుండటంతో సందీప్ ప్రభాస్ మీద కొంతవరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తొందరలోనే ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు పెట్టీ వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని ప్రభాస్ చూస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా షూట్ స్టార్ట్ అయితే 2027 వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది…