Amaravati Capital Development: అమరావతి( Amravati capital ) రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా 2028 నాటికి అమరావతిని ఒక రూపానికి తెచ్చి.. 2029 ఎన్నికలకు వెళ్లాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్టు చర్యలు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా సిఆర్డిఏ అధారిటీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. మరోవైపు అమరావతి ప్రాంతంలోనే ఓ 29 గ్రామాలు ఉన్నాయి. వాటిని సైతం అభివృద్ధి చేసి అమరావతిలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు సాగుతూనే.. ఇంకోవైపు ఐకానిక్ వంతెనను పూర్తిచేసి కొత్త రూపు తీసుకురావాలని భావిస్తోంది. నిన్ననే జరిగిన సిఆర్డిఏ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఒకవైపు పనులు చేస్తూనే వాటి వివరాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించారు.
Also Read: అమరావతికి కేంద్రం మరో గొప్పవరం.. ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మోడీ సర్కార్
29 పంచాయితీల అభివృద్ధి..
అమరావతి రాజధాని పరిధిలో 29 పంచాయితీలు ఉన్నాయి. అయితే ఒకవైపు అమరావతి నగరాల్లో అవి కూడా అనుసంధానంగా మారనున్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేస్తేనే అమరావతి రాజధాని లో అవి మనగలవు. అందుకే ఆ 29 గ్రామపంచాయతీలను రూ.904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు తాజాగా నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో డ్రెయిన్లు, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకుగాను ఎల్ పి ఎస్ జోన్స్ క్రిటికల్ ఇన్ఫ్రా ఎండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఐకానిక్ వంతెన అందంగా..
అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తూనే.. ప్రపంచస్థాయి గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలకు అనుసంధానిస్తూ కీలక నిర్మాణాలు జరపాలని నిర్ణయించారు. కృష్ణా నదిపై( Krishna river) నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. మరోవైపు స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టుల విషయంలో సైతం విభిన్నంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్డు లనుసంధానించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Also Read: అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏకంగా రూ.49 వేల కోట్లతో
నిధుల విడుదలకు ఆమోదం..
అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించి భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ( crda authority ) నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రధానంగా సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.411 కోట్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు రూ. 376.60 కోట్లు కేటాయించేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. మరోవైపు విట్, ఎస్సార్ ఎం యూనివర్సిటీ కి చేరు 100 ఎకరాలు చొప్పున అదనపు కేటాయింపులకు సి ఆర్ డి ఏ అధారిటీ అంగీకారం తెలిపింది. మంగళగిరిలో 78.01 ఎకరాల్లో జంక్షన్ జ్యువలరీ పార్క్ ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని సి ఆర్ డి ఏ నిర్ణయించింది. దాదాపు 5 వేల కోట్ల పెట్టుబడి తో ఏర్పాటు 20వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.