Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… ఆ సినిమా తర్వాత ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు. సినిమా తీసే విధానాన్ని మార్చేసిన ఈ దర్శకుడు అనిమల్ (Animal) సినిమాతో ఒక బోల్డ్ కంటెంట్ తో కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించవచ్చు అని నిరూపించాడు. ఇక తన డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామ్ గోపాల్ వర్మ (Ram gopal Varma) తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక కోణంలో చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో విలన్ గా చేయనున్న ఇద్దరు స్టార్ హీరోలు…
ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? తద్వారా ఈయనను స్టార్ డైరెక్టర్ గా మరోసారి ఎలివేట్ చేస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఆయన ఒక దేశభక్తికి సంబంధించిన సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ వంగ లాంటి ఒక బోల్డ్ సినిమాలను తీసే దర్శకుడు దేశభక్తికి సంబంధించిన సినిమాలను తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు చూపిస్తారట. కంప్లీట్ ఆయన డైరెక్షన్ స్టైల్ ని మార్చుకొని డిఫరెంట్ వేలో ఈ సినిమాని ప్రజెంట్ చేసే ప్రయత్నమైతే చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా లైన్ ని అల్లు అర్జున్ కి వినిపించారట…ఈ కథ పట్ల ఆయన చాలా ఎక్సైట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి చాలావరకు కృషి చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనే పోటీ జరుగుతుంది. అందులో సందీప్ రెడ్డి వంగా కూడా ఉండటం విశేషం…మరి తను ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని నెంబర్ వన్ దర్శకుడిగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…