NTR And Ram Charan: స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఏ కొంచెం తేడా జరిగినా కూడా వాళ్ళ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడమే కాకుండా ఆ సినిమా తీసిన దర్శకుడు మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది…
సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల మధ్య సినిమాలపరంగా పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ కెరియర్ లో వాళ్లంతా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో మాత్రం ఒకరి విషయంలో మరొకరికి చాలా వరకు పోటీలు అయితే ఉంటాయి. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య ఈ పోటీ అనేది విపరీతంగా ఉంటుంది. ఇలాంటి రెండు ఫ్యామిలీలో నుంచి వచ్చిన హీరోలను కలిపి రాజమౌళి(Rajamouli) భారీ బడ్జెట్ తో ‘త్రిబుల్ ఆర్ ‘ (RRR) అనే సినిమా చేశాడు. ఈ సినిమాను చూసిన చాలా మంది ఎన్టీఆర్ క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపించారు అంటూ కొన్ని కామెంట్స్ ని వ్యక్తం చేసినప్పటికి, కొంతమంది సినీ మేధావులు మాత్రం ఎన్టీఆర్ క్యారెక్టర్ కి కూడా చాలావరకు ప్రిఫరెన్స్ అయితే ఉంది అని చెబుతూ వస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి మధ్య చిన్న క్లాషెష్ కూడా వచ్చాయట.
షూటింగ్ మొదట్లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నప్పుడు వీళ్ళ మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగి ఇద్దరు ఎడమొహం పెదమోహం పెట్టుకొని ఉన్నారట. ఇది గమనించిన రాజమౌళి వాళ్ళిద్దరిని కలిపాడు. మొత్తానికైతే అప్పుడు రాజమౌళి కలిపిన వీళ్లిద్దరూ ఇప్పటివరకు సొంత బ్రదర్స్ ల ఉంటూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఒకరి సినిమా రిలీజ్ అయితే మరొకరు బెస్ట్ విషెస్ చెబుతూ వాళ్ల సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే రేంజ్ లో వీళ్ళ ఫ్రెండ్షిప్ మారిపోయింది అంటే అది జక్కన్న పుణ్యమనే చెప్పాలి. ఇక ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని రూల్ చేసే స్థాయికి ఎదుగుతున్నారని చెప్పడంలో ఎంత అతిశయోక్తి లేదు…
ఇక రాజమౌళి లాంటి దర్శకుడు భారీ మల్టీస్టారర్ సినిమాతో తెలుగు సినిమా స్టామినా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేశాడనే చెప్పాలి. వీళ్లిద్దరూ ప్రస్తుతం భారీ రికార్డులను కొల్లగొట్టడానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం ఇద్దరూ ఒకరికొకరు బద్ధ శత్రువుల సినిమా సక్సెస్ అవ్వడానికి తీవ్రమైన కృషి చేస్తుంటారు. కానీ పర్సనల్ జీవితంలో మాత్రం ఇద్దరు సొంత బ్రదర్స్ లా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…