Child Artist : అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన చిన్నారులు కొంతమంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అమ్మాయిలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా ఒకరు. ఈ చిన్నారి హీరో నితిన్ నటించిన జయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ జయం సినిమా తర్వాత తెలుగులో అంతగా సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న యంగ్ హీరో హీరోయిన్లలో కొంతమంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన వారే. ఒకప్పుడు వీళ్ళు తమ అమాయకమైన నటనతో చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్లుగా మారి వెండి తెరపై కూడా తమ సత్తా చూపిస్తూ దూసుకుపోతున్నారు.
Also Read : శేఖర్ మాస్టర్ అసభ్యకర స్టెప్స్ వెనుక అసలు కథ ఇదే, హీరో కూడా బాధ్యుడే!
అప్పట్లో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారులు కొంతమంది చదువుల కోసం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పటికీ కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక తెలుగులో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన జయం సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జయం సినిమాలో నితిన్, సదా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండి ఉంటుంది. అయితే ఈమె జయం సినిమాకు ముందు బుల్లితెరపై దాదాపు పది సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఈ చిన్నారి సీతా మహాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో ఈమెకు జయం సినిమా ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈ చిన్నారి తండ్రి తన ఫోటోలను జయం సినిమా దర్శకుడికి పంపించారు. అలా ఈ చిన్నారి జయం సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్ర కోసం ఫైనల్ అయింది.
జయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పేరు శ్వేత. జయం సినిమా తర్వాత శ్వేత తెలుగులో ఉత్సాహం, అనగనగా ఒ కుర్రాడు అనే సినిమాలలో నటించింది. తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాతో శ్వేతకు మంచి గుర్తింపు వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పటికీ కూడా జయం సినిమా పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించిన శ్వేత ఈ సినిమాలో అక్షరాలను తిప్పి రాసే అమ్మాయిగా బాగా ఫేమస్ అయ్యింది. తన నటనతో జయం సినిమాకు శ్వేత నంది అవార్డు కూడా అందుకుంది. ఇక శ్వేతా తల్లి జయలక్ష్మి కూడా సీరియల్ నటిగా మంచి గుర్తింపు ఉంది. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోనికి అడుగుపెట్టిన శ్వేత హీరోయిన్గా మాత్రం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వలేదు.