Sandeep Reddy Vanga and Allu Arjun : అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga)… ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రేక్షకుల్లో చాలా ఎక్కువ గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి బోల్డ్ డైరెక్టర్ అంటూ గుర్తింపును తీసుకురావడం విశేషం… అర్జున్ రెడ్డి, అనిమల్ రెండు సినిమాలు కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినవే కాకుండా అతనికి చాలా గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత తొందరగా సెట్స్ మీదకి తీసుకురావాలని తను ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈయన సినిమాలకు బాలీవుడ్ లోని కొంతమంది దర్శకులు వ్యతిరేకతను చూపిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు సందీప్ సినిమాల పైన విషాన్ని కక్కుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సందీప్ మాత్రం వాటి వేటిని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కాంబో లో రావాల్సిన సినిమా ఉంటుందా..?
ఇక సందీప్ ప్రభాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనౌన్స్ చేశాడు. అయినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయడానికి కొంతవరకు ఆసక్తి చూపించడం లేదట.
కారణం ఏంటి అంటే ఆయనకు బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేసే దర్శకుడిగా ఇమేజ్ అయితే ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ తన పాన్ ఇండియా ఇమేజ్ మీద ఏదైనా ప్రభావాన్ని చూపిస్తుందనే ఉద్దేశ్యంతో ఆయన సందీప్ ను పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి సందీప్ మాత్రం అల్లు అర్జున్ కాకపోతే రామ్ చరణ్ లేదంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగ మూవీ కి టైటిల్ ఫిక్స్..ఫ్యాన్స్ కి ఇక పూనకాలే!