Fauji : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక ప్రభాస్ లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు… బాహుబలి సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ స్టార్ హీరో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటితో సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఈయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : వివాదాల్లో ‘ఫౌజీ’..పాకిస్థాన్ ఆర్మీ కి హీరోయిన్ ఇమాన్వి కి ఉన్న లింక్ ఏమిటంటే!
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాతో ఒక ఆర్మీ ఆఫీసర్ అంటే ఎలా ఉంటాడో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తన క్యారెక్టరైజేషన్ లో గాని, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీలో గాని పూర్తిగా చేంజ్ చేసి చెప్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ప్రభాస్ చాలా అద్భుతంగా కనిపించబోతున్నాడట.
ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి ఇండియాలో నెంబర్ వన్ హీరో తనే అని మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ప్రభాస్ ఉన్నాడు. ఇక హను రాఘవపూడి సైతం ఇంతకుముందు దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) తో చేసిన సీతారామం (Seetharamam) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ తో పాటుగా ఆర్మీకి సంబంధించిన వార్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో హను రాఘవపూడి చాలా సెన్సిబుల్ విషయాలను సైతం చూపించి భారీ సక్సెస్ ని సాధించాడు. మరి ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమాలో సైతం అలాంటి మంచి సీన్స్ ను చూపించి భారీ విజయాన్ని అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…అయితే ఈ సినిమా చివర్లో ఒక భారీ ట్విస్ట్ అయితే ఉంటుందట…ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read : నాకు పాకిస్థాన్ సైన్యం తో సంబంధం లేదు..ఆరోపణలపై స్పందించిన ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్!