Bigg Boss 7 Telugu: 8 వారాలకు అన్ని లక్షలా…? మైండ్ బ్లాక్ చేసేలా సందీప్ రెమ్యూనరేషన్ డిటైల్స్!

8వ వారానికి శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని, భోలే, సందీప్ నామినేట్ అయ్యారు. శనివారం ఎపిసోడ్లో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయ్యారు. ఇక ఆదివారం ఫన్నీ గేమ్స్ ఆడిస్తూనే హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ ప్రాసెస్ జరిపారు.

Written By: Neelambaram, Updated On : October 30, 2023 11:13 am
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో మరో ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఆట సందీప్ ఈ వారం బిగ్ బాస్ ఇంటికి వీడాడు. గత ఏడు వారాలు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి వరుసగా ఇంటి బాట పట్టారు. వీరిలో రతికకు సెకండ్ ఛాన్స్ దక్కింది. ఆమె రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా 8వ వారానికి శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని, భోలే, సందీప్ నామినేట్ అయ్యారు. శనివారం ఎపిసోడ్లో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయ్యారు. ఇక ఆదివారం ఫన్నీ గేమ్స్ ఆడిస్తూనే హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ ప్రాసెస్ జరిపారు. అమర్ దీప్, అశ్విని, శివాజీ, భోలే వరుసగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి సందీప్, శోభా శెట్టి మిగిలారు. వీరిద్దరినీ నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు.

ఇద్దరి హార్ట్ బీట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎవరి హార్ట్ బీట్ అయితే ఆగిపోయి రెడ్ లైన్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లని నాగార్జున చెప్పారు. సందీప్ హార్ట్ బీట్ ఆగిపోవడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున చెప్పాడు. సందీప్ ఎలిమినేట్ అయినందుకు తేజా, శోభా చాలా ఫీల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. సందీప్ ఇంటిని వీడి హోస్ట్ నాగార్జున వద్దకు వెళ్లారు. నాగార్జున సందీప్ కి వీడ్కోలు తెలిపారు.

మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్ ఎలిమినేట్ కావడమైంది. కాగా 8 వారాలు హౌస్లో ఉన్న సందీప్ రెమ్యూనరేషన్ గురించి సమాచారం అందుతుంది. విశ్వసనీయ సమాచారం ఏంటంటే… సందీప్ వారానికి రూ. 3 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. ఆ లెక్కన సందీప్ రూ. 24 లక్షలు రెమ్యూనరేషన్ గా పొందారని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేట్ అయిన ఫస్ట్ మేల్ కంటెస్టెంట్ కూడా సందీప్ కావడం విశేషం.