Jayalalitha: ఎంజీఆర్ క్యాప్ కొట్టేసి కోటీశ్వరులు అయిన జయలలిత…

ఎంజీఆర్ డబ్బులు మొత్తాన్ని స్విస్ బ్యాంకు లో పెట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తన క్యాప్ లోనే ఉంచుకొని ఎప్పుడు తన తల పైన పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు.

Written By: Neelambaram, Updated On : October 30, 2023 11:04 am
Follow us on

Jayalalitha: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగిన నటుడు ఎంజీఆర్…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఎంజీఆర్ జయలలిత తో కలిసి చాలా సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఒక రాజకీయ పార్టీని పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సీఎంగా కూడా ఎదిగాడు.అయితే కొద్ది సంవత్సరాల పాటు తన పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఇక ఆ క్రమంలో ఆయన తమిళనాడు లో చాలా అభివృద్ధి పనులను కూడా చేశాడు.

ఇక అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ఎంజీఆర్ కి హిందీ,ఇంగ్లీష్ ఏమి రావు తనకు వచ్చింది ఒకటే తమిళ్ అందువల్లే కేంద్ర ప్రభుత్వానికి, స్టేట్ గవర్నమెంట్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుండడంతో అప్పటికి ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం ఉన్న జయలలితని తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది.ఇక తనకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత మంత్రిగా కూడా తనని తన మంత్రివర్గంలో చేర్చుకోవడం జరిగింది.

ఇక ఇలాంటి క్రమంలోనే జయలలితకి శశికళ మంచి ఫ్రెండ్ అయింది. ఇక ఒకానొక సందర్భంలో ఎంజీఆర్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన హాస్పటల్లో ఉన్నారు ఇక అలాంటి సమయంలో పార్టీని తన భార్య అయిన జానకి చెజిక్కించుకోవాలని చూసింది. అలాగే ఒక వర్గం నుంచి జయలలిత ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది. ఇలా వీళ్ళిద్దరూ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎంజీఆర్ చనిపోవడం జరిగింది అప్పుడు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ జానకి గారు వైఫై ఉండడం గమనించిన జయలలిత తను సీఎంగా ఎదగాలంటే తన దగ్గర డబ్బులు ఉండాలని తెలుసుకుంది.

ఇక అప్పటికే ఎంజీఆర్ డబ్బులు మొత్తాన్ని స్విస్ బ్యాంకు లో పెట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తన క్యాప్ లోనే ఉంచుకొని ఎప్పుడు తన తల పైన పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఎంజీఆర్ ఎవరిని నమ్మేవాడు కాదు ఇక అలాంటి సందర్భంలోనే ఎంజిఆర్ చనిపోయాడు ఆ తర్వాత శివం దగ్గర నుంచి శశిరేఖ సహాయంతో జయలలిత ఆ టోపీని ప్లాన్ చేసి దొంగిలించింది ఎంజీఆర్ స్విస్ బ్యాంక్ లో పెట్టిన మనీ మొత్తాన్ని రాబట్టి ఎమ్మెల్యేలను చేర్చుకొని తన గుపట్లోకి తెచ్చుకొని తను సిఎం గా ఎదగడం జరిగింది.అలా ఎంజీఆర్ టోపి కొట్టేయడం వల్ల జయలలిత కోటీశ్వరాలయింది…