Homeఎంటర్టైన్మెంట్షాకింగ్ : ప్రముఖ యువ నటుడు కన్నుమూత !

షాకింగ్ : ప్రముఖ యువ నటుడు కన్నుమూత !

జాతీయ అవార్డు అందుకున్న యావ నటుడు ‘సంచారీ విజయ్‌’ ప్రమాదవశాత్తు కన్ను మూయడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే తీరని లోటు. ఈ నెల 12న బైక్‌ మీద ప్రయాణిస్తోన్న విజయ్‌ కి అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలు అయిన విజయ్ ను బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. అయితే, ఆయన మెదడు కుడి భాగాలతో పాటు తొడల ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలు అవ్వడంతో వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. ప్రాణాపాయ స్థితికి […]

Sanchari Vijay diedజాతీయ అవార్డు అందుకున్న యావ నటుడు ‘సంచారీ విజయ్‌’ ప్రమాదవశాత్తు కన్ను మూయడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే తీరని లోటు. ఈ నెల 12న బైక్‌ మీద ప్రయాణిస్తోన్న విజయ్‌ కి అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలు అయిన విజయ్ ను బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. అయితే, ఆయన మెదడు కుడి భాగాలతో పాటు తొడల ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలు అవ్వడంతో వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు.

ప్రాణాపాయ స్థితికి వెళ్లిన విజయ్ కి సర్జరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక సంచారీ విజయ్ శరీరభాగాలను అవయవ దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. సంచారీ విజయ్‌ మరణవార్త విని కన్నడ చిత్రసీమ తీవ్ర శోకసంద్రంలో మునిగి పోయింది.

కన్నడ సినీ ప్రముఖులు సంచారీ విజయ్ మరణం పట్ల స్పందిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ సోషల్ మీడియాలో విజయ్ గురించి చెబుతూ ‘సంచారీ విజయ్‌ లేడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. తనను నేను లాక్‌ డౌన్‌ కి ముందు కొన్నిసార్లు కలిశాను. భవిష్యత్తు పై చాలా నమ్మకంగా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ, ఈ లోపే ఇలా జరగడం బాధాకరం’ అంటూ సుదీప్‌ ఎమోషనల్ అయ్యారు.

‘సంచారీ విజయ్’ మృతి పట్ల పలువురు కన్నడ సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కన్నడ నటుడు సంచారీ విజయ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper