‘కావ్య థాపర్’.. తెలుగు చిన్న సినిమాలకు దొరికిన బెస్ట్ హీరోయిన్. చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండటం, పైగా అనవసరపు ఖర్చులు పెట్టించడం లాంటివి చేయకపోవడం, అన్నిటికి మించి ‘ఏక్ మినీ కథ’ లాంటి సినిమాతో రీసెంట్ గా హిట్ అందుకోవడం.. మొత్తానికి ఈ భామకు కాలం కలిసొచ్చింది. నాలుగైదు కోట్లు మార్కెట్ ఉన్న హీరోలకు హీరోయిన్ గా ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఎవరంటే.. కావ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది.
నిజానికి పాపులారిటీ పరంగా చూసుకుంటే కావ్య థాపర్ కంటే, ఎక్కువ పాపులారిటీ ఉన్న కుర్ర భామలు చాలామంది ఉన్నారు. కానీ ఈ భామ సినిమా కోసం, కాస్త ఎక్కువ కష్టపడుతుందట. అదనపు కాల్షీట్స్ తో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా పట్టువిడుపులు ఉన్నాయట. పైగా అందాల ప్రదర్శనలో ఈ భామ చాలా హాట్ గురూ అని అంటున్నారు.
అన్నిటికీ మించి నటనలో కూడా కాస్త విషయం ఉన్న మెటీరియల్ అట. అలాగే భాషలో కూడా స్పష్టత ఉండటం, షూటింగ్ స్పాట్ లో కాస్త తెలివిగా ప్రవర్తించడం లాంటి విషయాలు కూడా కావ్యకి బాగా ప్లస్ గా ఉన్నాయి. రానున్న రోజుల్లో కావ్య తాపర్ కి మరిన్ని సినిమాలలో అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. దీనికి తోడు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజీలను హాట్ హాట్ ఫోటో షూట్లతో నింపేస్తూ రోజురోజుకు ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతూ ఉంది.
నిజానికి కావ్య ఐదేళ్ల క్రితమే తెలుగులోకి అడుగుపెట్టినా ఇన్నేళ్లు సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. అయితే, అనుభవాన్ని మాత్రం బాగానే గడించింది. ఎలాగూ అందాల ఆరబోతలో ఎటువంటి సంకోచం లేదు కాబట్టి, టాలీవుడ్ కి మరో గ్లామర్ గర్ల్ దొరికినట్లే లెక్క. ‘ఏక్ మినీ కథ’తో హిట్ కూడా వచ్చింది కాబట్టి, మరో హిట్ పడితే స్టార్ ల సినిమాల నుండి కూడా ఛాన్స్ లు వస్తాయి.