https://oktelugu.com/

Radheshyam: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు

Radheshyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇటీవలే ఈ సినిమాలోని సంచారి అనే సాంగ్​ టీజర్​ను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 01:37 PM IST
    Follow us on

    Radheshyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇటీవలే ఈ సినిమాలోని సంచారి అనే సాంగ్​ టీజర్​ను విడుదల చేసిన చిత్ర యూనిట్​.. ఇప్పుడు పూర్తి పాటను విడుదల చేసి ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు రేకెత్తించింది. ఈ పాటను 5 భాషల్లో సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది.

    Radheshyam

    Also Read: “ఆదిపురుష్” మూవీ టీమ్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చిన ప్రభాస్…

    తాజాగా విడుదలైన ఈ వీడియో సాగ్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతోంది. ఈ పాటలో ప్రభాస్​ క్యారెక్టర్​ను చూపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ జర్నీ, సాహసాలను ఇష్టపడే వ్యక్తిగా చూపించారు. కాగా, సినిమా షూటింగ్ మొత్తం యూరప్​లోని వివిధ పాత్రాల్లో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ పాటను తెలుగులో కృష్ణకాంత్​ రచించారు. జస్టిస్​ ప్రభాకరన్​ సంగీతం అందించగా.. అనిరుధ్​ ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది. ఇందులో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్​. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

    Also Read: కొత్త మూవీకి ఒకే చెప్పిన నటి లావణ్య త్రిపాఠి… టైటిల్ ఏంటంటే