https://oktelugu.com/

Bheemla Nayak Heroine Samyuktha Menon: మరో ఆఫర్ అందుకున్న భీమ్లానాయక్ హీరోయిన్……

Bheemla Nayak Heroine Samyuktha Menon:టాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న కేరళ బ్యూటీస్. నిన్నమొన్నటిదాకా రేవతి, శోభన ఉండగా ఇప్పుడు నయనతార, నిత్యామీనన్, సమంతల తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే ఇదే లిస్ట్ లో మరి బ్యూటీ అయినా సంయుక్తా మీనన్ చేరారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు సంయుక్తా మీనన్ గురించి తెలుగు వారికి అంతగా తెలీదు అనే చెప్పాలి. “భీమ్లానాయక్‌” లో రానాకి జోడీగా తన […]

Written By: , Updated On : December 24, 2021 / 05:04 PM IST
Follow us on

Bheemla Nayak Heroine Samyuktha Menon:టాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న కేరళ బ్యూటీస్. నిన్నమొన్నటిదాకా రేవతి, శోభన ఉండగా ఇప్పుడు నయనతార, నిత్యామీనన్, సమంతల తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే ఇదే లిస్ట్ లో మరి బ్యూటీ అయినా సంయుక్తా మీనన్ చేరారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు సంయుక్తా మీనన్ గురించి తెలుగు వారికి అంతగా తెలీదు అనే చెప్పాలి. “భీమ్లానాయక్‌” లో రానాకి జోడీగా తన పేరును అనౌన్స్ చేశాకే ఈమె ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారంతా మేకర్స్.

Bheemla Nayak Heroine Samyuktha Menon

Bheemla Nayak Heroine Samyuktha Menon

Also Read: న్యాయానికి, ధర్మానికి రోజులు లేవంటున్న… బండ్ల గణేష్

మలయాళ చిత్రమైన పాప్‌కార్న్ సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలు పెట్టారు ఈ అమ్మడు.‘కలరి’ అనే సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది సంయుక్తా(Samyuktha Menon). తమిళంలో రెండు మూడు చిత్రాలు నటించే అవకాశం అందుకోగా ఇంతలో ఇటు తెలుగులోనూ పవన్ కళ్యాణ్ చిత్రంలో చాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.విశేషమేమిటంటే.. భీమ్లానాయక్ ఇంకా రిలీజ్ కాకముందే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో సంయుక్త అవకాశం అందుకున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సినిమా లో సంయుక్తనే హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ చేసినట్లు ప్రకటించారు యూనిట్ బృందం. ఫార్చ్యూన్‌ ఫోర్‌‌ సినిమాస్‌తో సూర్యదేవర నాగవంశీ ఈ తెలుగు, తమిళ బైలింగ్వల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇలా బ్యాక్ టు బ్యాక్‌ బిగ్ ప్రాజెక్ట్స్‌లో లక్కీ ఛాన్స్ తో దూసుకుపోతున్నారు ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరి ఈ అమ్మడు కూడా కేరళ బ్యూటీస్ లా స్టార్ హీరోయిన్ అవుతుందా లేదో.

Also Read: భీమ్లానాయక్ వాయిదా పడటానికి కారణం అతనేనా?