Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేషనల్ నటుడు రానా కలిసి మెలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ సినిమా ‘అయ్యపనం కోషియం’ ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో రెండు హీరోయిన్ల పాత్రలు కూడా ఉన్నాయి. అందుకే మొదటి నుంచి ఈ సినిమాలో మంచి నటీమణులను తీసుకోవాలని నిర్మాతలు భావించారు. ముఖ్యంగా నటన బాగా వచ్చిన వాళ్లనే పెట్టుకోవాలనుకున్నారు.

అందుకే, ఈ కథతో పాటు హీరోయిన్లను కూడా మలయాళం నుంచి దిగుమతి చేసుకున్నారు. సహజంగా మలయాళీ భామలకు అందాలతో పాటు గొప్ప టాలెంట్ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువ మంది హీరోయిన్లు మలయాళీ భామలే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్య మీనన్ ను పెట్టుకున్నారు.

నిత్యా మీనన్ కి స్టార్ డమ్ రాకపోయినా మంచి నటి, ఎలాంటి పాత్రను అయినా అద్భుతంగా నటిస్తోందని పేరు ఉంది. దాంతో పవన్ కి జోడిగా నిత్యను ఖాయం చేశారు. ఆమె కూడా షూట్ లో యాక్టివ్ గా పాల్గొంటూ వచ్చింది. పవన్ తో నిత్యా కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ మధ్య వచ్చిన ఓ వర్కింగ్ వీడియోలో పవన్ సిగ్గు పడుతూ ఉంటే.. నిత్యా పవన్ ను తడుతూ కనిపించింది.

మొత్తానికి పవన్ – నిత్యా జంట బాగుంది అనే క్రెడిట్ దక్కించుకుంది. అందుకే, రానాకి కూడా మంచి నటి ఉండాలి అనే ఉద్దేశ్యంతో.. రానాకి జోడిగా మరో కేరళ కుట్టిని పట్టుకొచ్చారు. పేరు సంయుక్త మీనన్. ఈమె కూడా మంచి నటినే. కొన్ని కేరళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కాకపోతే, ఇటు పవన్ సరసన నిత్యా మీనన్, అటు రానా సరసన సంయుక్త మీనన్.

Also Read: Payal Rajput: మళ్ళీ అందాల ప్రదర్శనే నమ్ముకున్న పాయల్ !
మొత్తమ్మీద ఇద్దరు మీనన్ ముద్దుగుమ్మల మధ్యలో ‘భీమ్లా నాయక్’ వస్తుండటం విశేషమే. కానీ, ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు. అలాంటపుడు హీరోయిన్లుగా ఎవరు నటిస్తే మాత్రం మాకెందుకు అంటున్నారు ఫ్యాన్స్. అయినా హీరోయిన్లకు ప్రాముఖ్యత లేదు కాబట్టే.. క్రేజ్ లేని నిత్యమీనన్ ను, ఎవరో తెలియని సంయుక్త మీనన్ ను హీరోయిన్లుగా తీసుకున్నది.
Also Read: Samantha: ప్చ్.. ఒక్కోటి తీసేసుకుంటూ పోతున్న సమంత !