Samantha: సమంత చాలా లక్కీ అన్నారు. నాగ చైతన్య లాంటి భర్తను పొందింది కాబట్టి, ఆమెకు ఆ అదృష్టాన్ని ఆపాదించారు. పైగా సామ్ కి మంచి ముందుచూపు ఉన్న హీరోయిన్ అని కూడా కితాబు ఇచ్చారు. ఒక హీరోని లైన్ లో పెట్టి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిందనే అక్కసుతో ఇండస్ట్రీలో కొంతమంది నిత్యం ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు.
కానీ ఆ కామెంట్ల దిష్టి తగిలిందో.. లేక, సామ్ కి బ్యాడ్ లక్ వెంటాడిందో తెలియదు గానీ, మొత్తానికి సామ్ జాతకం మళ్లీ మొదటికి వచ్చింది. స్టార్ ఇంటి కోడలు పాత్ర నుంచి సగటు సినిమా హీరోయిన్ స్థాయికి పడిపోయింది. సినిమా హీరోయిన్ ను ఎలా చూస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో సామ్ పరిస్థితి అలాగే ఉంది. హిందీ దర్శకులు ఆడిషన్ అని పిలిచి అఫీస్ ల చుట్టూ తిప్పుతున్నారు.
వాళ్లల్లో ఎంతమంది అవకాశాలు ఇస్తారో తెలియదు, అసలు ఛాన్స్ లు ఇస్తారనే నమ్మకమే లేదు. అయినా ఆడిషన్ కి వెళ్లి వాళ్ళు కోరిన విధంగా నటించి రావాలి. అందుకే సామ్ ఈ మధ్య కాస్త చిరాకుగా ఉంటుందట. భర్త చైతుతో విడిపోతున్నట్లు ప్రకటించి దాదాపు నెల అవుతుంది. ఇప్పుడు చైతన్య జ్ఞాపకాలను త్వరగా మర్చిపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.
ముఖ్యంగా చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను తొలగిస్తూ ఉంది. గతంలో నాగ చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే, ఇప్పుడు చైతుతో విడిపోయింది. అందుకే, గతంలో పోస్ట్ చేసిన ఆ ఫోటోలను తొలగిస్తుంది. కాకపోతే అన్ని ఫోటోలను ఇంకా తొలగించలేదు. ఇంకా కొన్ని ఫోటోలు సామ్ ఇన్ స్టాగ్రామ్ టైం లైన్ లో ఉన్నాయి.
Also Read: Bheemla Nayak: ” భీమ్లా నాయక్ ” లో రానాకి జతగా సంయుక్త మీనన్… అఫిషియల్ అనౌన్స్ మెంట్
అయితే, కొన్ని ఫోటోలను మాత్రం ఇప్పటికే తొలిగించింది. బహుశా .. చైతుతో అతి సన్నిహితంగా దిగిన ఫోటోలను తొలగిస్తోందేమో. మొత్తానికి చైతుతో జరిగిన కాపురాన్ని, అలాగే వాళ్ళ దాంపత్య జీవితంలో జరిగిన గురుతులు తొలగించుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఇంకా కోర్టు ఈ జంటకు విడాకులు గ్రాంట్ చెయ్యలేదు. కానీ ఈ జంట మాత్రం ప్రస్తుతం వేర్వేరుగానే జీవిస్తున్నారు.
Also Read: Ajay Bhupathi: ఫ్యాన్స్ కు ట్విట్టర్ వేదికగా క్షమాపనలు చెప్పిన … డైరెక్టర్ అజయ్ భూపతి