Samantha Disease: సమంత లేటెస్ట్ ఫోటోలు కలవరపెడుతున్నాయి. ఆమె అందాన్ని, ఆరోగ్యాన్ని ఆ మహమ్మారి కృంగదీస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. నేడు సమంత పోస్ట్ చేసిన ఫొటోలో చాలా భిన్నంగా కనిపించారు. ఒకప్పటి మెరుపు ఆమె ముఖంలో లేదు. చాలా మార్పు ఆమెలో కనిపిస్తున్నాయి. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇది కండరాలకు సంబంధించిన రుగ్మత. కండరాల వాపుకు గురి కావడం, అలాగే కుచించుపోవడం, నొప్పి, తీవ్ర అలసట ఈ వ్యాధి లక్షణాలు. అందాన్ని కూడా మయోసైటిస్ దెబ్బతీస్తుందని నిపుణుల అభిప్రాయం.

అయితే మయోసైటిస్ టైప్ ని బట్టి ప్రమాద తీవ్ర ఉంటుంది. రోజురోజుకు మయోసైటిస్ కారణంగా సమంత శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయేమో అన్న సందేహం కలుగుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటో ఈ అనుమానాలకు కారణమైంది. యశోద ప్రమోషన్స్ లో భాగంగా… ”యశోద విడుదలకు ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. కొంచెం ఆందోళనగా అలాగే ఆతృతగా ఉంది. యశోద మీ అందరికీ నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నాను. నాలాగే సినిమాకు మీరిచ్చే రివ్యూ కోసం ఎదురు చూస్తున్న యశోద టీమ్ కి బెస్ట్ విషెస్…” అంటూ ట్వీట్ చేశారు.
ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో సమంత లుక్ డల్ గా ఉంది. ఒకప్పటి గ్లో, ఎనర్జీ ఆమె ముఖంలో కనిపించలేదు. ఇటీవల తన ఆరోగ్యం గురించి నేరుగా సమంత స్పష్టత ఇచ్చారు. ఇది పత్రికల్లో వచ్చినంత ప్రాణాంతకం కాదు అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాడి గెలవాలి. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. భవిష్యత్ గురించి చెప్పలేను, అన్నారు. సమంత కామెంట్స్ సైతం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిజం ఏదైనా సమంత త్వరగా కోలుకోవాలని, ఆమె మరిన్ని సినిమాలు చేసి ఎంటర్టైన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు.

ఇక యశోద పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో విడుదల కానుంది. సరోగసీ ఆధారంగా మెడికల్ మాఫియా నేపథ్యంలో యశోద సాగనుంది. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. సమంత భీకర యాక్షన్, అడ్వెంచరస్ ఛేజింగ్ సన్నివేశాల్లో నటించారు. దర్శక ద్వయం హరి-హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. నవంబర్ 11న విడుదల అవుతుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక రోల్స్ చేస్తున్నారు.