https://oktelugu.com/

Modi Vs TRS Posters : ‘పోస్టర్స్ వార్’: మోడీ తెలంగాణలోకి రావద్దు.. మళ్లీ టార్గెట్ చేసిన టీఆర్ఎస్

Modi no entry to Telangana posters  : బీజేపీ జాతీయ మహాసభలను హైదరాబాద్ లో నిర్వహించిన సమయంలో మోడీ వ్యతిరేక విధానాలపై హైదరాబాద్ అంతటా బ్లాక్ కలర్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గట్టి షాకిచ్చిన టీఆర్ఎస్ బ్యాచ్ ఇప్పుడు మరోసారి మోడీని టార్గెట్ చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తెలంగాణకు వస్తున్న మోడీకి నిరసనతో స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ రెడీ అయ్యింది. ఈ మేరకు ‘మోడీ నో ఎంట్రీ టు తెలంగాణ’ పేరుతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2022 / 06:49 PM IST
    Follow us on

    Modi no entry to Telangana posters  : బీజేపీ జాతీయ మహాసభలను హైదరాబాద్ లో నిర్వహించిన సమయంలో మోడీ వ్యతిరేక విధానాలపై హైదరాబాద్ అంతటా బ్లాక్ కలర్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గట్టి షాకిచ్చిన టీఆర్ఎస్ బ్యాచ్ ఇప్పుడు మరోసారి మోడీని టార్గెట్ చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తెలంగాణకు వస్తున్న మోడీకి నిరసనతో స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ రెడీ అయ్యింది. ఈ మేరకు ‘మోడీ నో ఎంట్రీ టు తెలంగాణ’ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా మోడీ పర్యటించే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి షాకిచ్చింది.

    ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నిరసిస్తూ ‘మోడీ నో ఎంట్రీ టు తెలంగాణ’ పేరిట రామగుండం ,కరీంనగర్, హైదరాబాద్ లో పలుచోట్ల తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరున పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఇది చేసింది తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఎంత మాత్రం కాదని.. ఆ పేరిట టీఆర్ఎస్ చేస్తోందన్నది కాదనలేని సత్యం. మోడీ వ్యతిరేక విధానాలపైనే ఈ ఫ్లెక్సీలు వెలియడంతో ఇదంతా గులాబీ బ్యాచ్ చేస్తోందని అర్థమవుతోంది.

    ఇటీవల కేంద్రంలోని మోడీ సర్కార్ చేనేత దుస్తులపై 5శాతం జీఎస్టీ విధించింది. దీంతో అసలే చేనేత దుస్తులు, క్రయవిక్రయాలు చాలా తక్కువగా జరుగుతాయి.దేశంలో జీన్స్, బ్రాండెడ్ దుస్తులు వచ్చాక చేనేత వస్త్రాలు కొనుగోళ్లు తగ్గిపోయాయి. గోరు చుట్టపై రోకలి పోటు అన్నట్టు మోడీ సర్కార్ ఇప్పుడు చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ విధించడంతో ఆ చేనేత రంగంపై పిడుగుపడ్డట్టు అయ్యింది.

    దీన్ని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మోడీకి చేనేతలతో ల ఉత్తరాలు రాసి నిరసనలు తెలిపారు. స్వయంగా కేసీఆర్ కూడా మునుగోడు సభలో ప్రధానికి చేనేతలపై లేఖలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కష్టించి పనిచేసే చేనేతన్నలపై మోడీ సర్కార్ జీఎస్టీ వల్ల భారం పడి వారి మనుగడ కష్టమవుతుందని ఆ రంగం అంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    దీన్ని సదావకాశంగా మలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మోడీకి ‘చేనేతలపై 5శాతం జీఎస్టీ’ని తొలగించాలనే డిమాండ్ తో ‘మోడీ నో ఎంట్రీ టు తెలంగాణ’ అనే పోస్టర్లను ఏర్పాటు చేసి షాకిస్తోంది. పేరుకు తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ అని రాసినా దీనివెనుక గులాబీ బ్యాచ్ ఉందన్నది కాదనలేని సత్యం. టీఆర్ఎస్ మద్దతు లేకుంటే ఈ ఫ్లెక్సీలను ఎప్పుడో పోలీసులు, అధికారులు తీసివేసేవారే. కానీ ఆప్లెక్సీలు అలానే ఉంచారంటే తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఉన్నట్టే లెక్క. సో తెలంగాణ పర్యటనలో మోడీకి టీఆర్ఎస్ ఇలా స్వాగతం పలుకుతోందన్న మాట.. !