https://oktelugu.com/

Samantha Yashoda: ఓవర్సీస్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ని దాటేసిన సమంత యశోద చిత్రం..ఇది మాములు అరాచకం కాదు

Samantha Yashoda: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ల దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న నటి సమంత..తెలుగు , తమిళం హిందీ అని తేడా లేకుండా ప్రతి ప్రాంతీయ భాషలోనూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నారు..అందం తో పాటు అద్భుతమైన అభినయం కలిగి ఉన్న అతి తక్కువమంది హీరోయిన్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 21, 2022 / 07:37 AM IST

    Samantha, Chiranjeevi

    Follow us on

    Samantha Yashoda: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ల దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న నటి సమంత..తెలుగు , తమిళం హిందీ అని తేడా లేకుండా ప్రతి ప్రాంతీయ భాషలోనూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నారు..అందం తో పాటు అద్భుతమైన అభినయం కలిగి ఉన్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరైన సమంత గారు కథ నచ్చితే విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు..ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇందులో సమంత ఒక గర్భిణీ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్ అందరి దృష్టిని ఆకర్షించడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో జరుగుతుంది.

    Samantha

    ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి మార్కెట్ లో మాములు డిమాండ్ లేదు..సమంత చిత్రాలన్నీ ఇక్కడ ఒక రేంజ్ హిట్స్ గా నిలవడం..దానికి తోడు ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’ ఇక్కడ 1 మిలియన్ కి పైగా డాలర్స్ ని వసూలు చెయ్యడం తో ‘యశోద’ సినిమాకి ఓవర్సీస్ రైట్స్ మొత్తం కలిపి 5 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..త్వరలో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా బిజినెస్ కూడా ఇంచు మించు ఓవర్సీస్ లో ఇంతే చేసింది..కేవలం అమెరికా లో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 3 కోట్ల 40 లక్షల రూపాయలకు జరిగిందట.

    Also Read: Bigg Boss 6 Telugu బిగ్ బాస్: ఇదే టాస్క్ రా స్వామీ.. తన్నుకు చచ్చారు.. నేహా, ఆరోహిలకు గాయాలు.. ఇనాయాపై దాడికి యత్నం

    Samantha Yashoda

    కానీ సమంత ‘యశోద’ సినిమాకి అమెరికా లో నాలుగు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది..మెగాస్టార్ సినిమాని దాటడం అంటే మాములు విషయం కాదు..హిట్ అయితే కచ్చితంగా మిలియన్ డాలర్లకు పైగానే వసూళ్లను రాబడుతుంది అని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి ఈ సినిమా రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డ్స్ ని సృష్టిస్తుందో అనేది.

    Also Read: Oscars-2023 Nominations ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ కు షాక్.. గుజరాత్ సినిమా ఆస్కార్ కు.. మతలబు ఏంటబ్బా? 

    Recommended videos:

    Tags