https://oktelugu.com/

Samantha : నాగ చైతన్య కి మరదలుగా మారిపోయిన సమంత..ఈ ట్విస్టు మాములుగా లేదుగా!

రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో సమంత దూళిపాళ్ల, శోభిత తో నిశ్చితార్థం జరుగుతున్న సమయం లో ఆమె తీసుకున్న సెల్ఫీ ని అప్లోడ్ చేస్తూ ఒక పోస్ట్ వేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరో విశేషం ఏమిటంటే సమంత దూళిపాళ్ల హీరోయిన్ సమంత కి కూడా బాగా పరిచయం ఉన్న అమ్మాయి అట. అనేక సందర్భాలలో వీళ్ళు పార్టీలలో కలుసుకునే వారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 03:04 PM IST
    Follow us on

    Samantha : నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత – నాగ చైతన్య జంట కచ్చితంగా ఉండేది. వాళ్లిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ప్రతీ రోజు మీడియా లో ట్రెండింగ్ లో ఉండేవారు. రోజు ఎదో ఒక వార్త వీళ్లకు సంబంధించి సోషల్ మీడియా తిరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు శోభిత తో నాగ చైతన్య కి పెళ్లి అయ్యింది, ఇక నుండి అయినా సమంత , నాగ చైతన్య ని కలుపుతూ వార్తలు రావు అని మీరు అనుకుంటే పెద్ద పొరపాటే. సమంత నాగ చైతన్య ని అంత తేలికగా వదిలేలా లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే శోభిత దూళిపాళ్ల కి ఒక్క చెల్లెలు ఉంది. ఆమె పేరు సమంత దూళిపాళ్ల.
    రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో సమంత  దూళిపాళ్ల,శోభిత తో నిశ్చితార్థం జరుగుతున్న సమయం లో ఆమె తీసుకున్న సెల్ఫీ ని అప్లోడ్ చేస్తూ ఒక పోస్ట్ వేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరో విశేషం ఏమిటంటే సమంత దూళిపాళ్ల హీరోయిన్ సమంత కి కూడా బాగా పరిచయం ఉన్న అమ్మాయి అట. అనేక సందర్భాలలో వీళ్ళు పార్టీలలో కలుసుకునే వారు. ఇకపోతే శోభిత దూళిపాళ్ల నాగ చైతన్య తో మూడేళ్ళ ముందు నుండే రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. వీళ్ళ రహస్య సంబంధం వల్లనే సమంత నాగ చైతన్య తో విభేదించి బయటకి వచ్చింది అని సమంత అభిమానులు సోషల్ మీడియా లో అంటున్నారు. మరో పక్క అక్కినేని అభిమానులు మాత్రం సమంత తన వ్యక్తిగత అసిస్టెంట్ తో కలిసి ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను అప్లోడ్ చేస్తూ, మీ రహస్య సంబంధం వల్లనే నాగ చైతన్య సమంత తో విడిపోవాల్సి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న వెంటనే అతనిని ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అన్నీ సోషల్ మీడియా మాధ్యమాలలో అన్ ఫాలో కొట్టింది.

    కానీ నాగ చైతన్య మాత్రం ఇన్ని రోజులు సమంత ని ఫాలో అవుతూ వస్తున్నాడు. పెళ్లి సమయం లో ఆమెతో దిగిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ నుండి తొలగించలేదు. కానీ ఎప్పుడైతే శోభిత తో నిశ్చితార్థం చేసుకున్నాడో, అప్పుడే సమంత ని అన్ ఫాలో కొట్టి, పెళ్లి ఫోటోలను కూడా తొలగించాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక పోతే కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం సమంత రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఉంది, కానీ నాగ చైతన్య మాత్రం టాలీవుడ్ లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. భవిష్యత్తులో వీళ్లిద్దరి జాతకాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.