https://oktelugu.com/

Anasuya Bharadwaj: పక్కనోళ్ళకు నీతులు చెప్పే అనసూయ ఇలా తయారయ్యిందేంటి… బుల్లితెర షోలో వల్గర్ కామెంట్స్!

టీఆర్పీ కోసం టెలివిజన్ షోలలో వల్గారిటీ శృతి మించుతుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనసూయ చేసిన పనికి జనాలు తిట్టిపోస్తున్నారు. నీతులు చెప్పే అనసూయ ఇలాంటి పనులు చేయడమేంటని అంటున్నారు. ఆమె వాడిన ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ చాలా పచ్చిగా ఉంది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 11, 2024 / 03:26 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ కెరీర్ ఫుల్ ఫార్మ్ లో ఉంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనసూయ చేసిన కామెంట్స్ చాలా వల్గర్ గా ఉన్నాయి. దీంతో నెటిజన్లు అనసూయని ఏకిపారేస్తున్నారు.

    కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో పై ఫస్ట్ ఎపిసోడ్ నుంచే సోషల్ మీడియాలో వ్యతిరేకత మొదలైంది. ఓ టాస్క్ లో భాగంగా అనసూయ జాకెట్ విప్పడం తెగ వైరల్ అయింది. ఇదేం టాస్క్ రా బాబు. చిన్న పిల్లలు, ఫ్యామిలీ తో కలిసి చూసే షోలో ఈ దరిద్రం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. అనసూయ, శేఖర్ మాస్టర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ కాంట్రవర్సీ ఉంటుందని వాపోయారు. అనసూయ ఈ విమర్శలపై స్పందించింది. ఎప్పటిలానే తనను తాను సమర్థించుకుంది. తన డ్రెస్సింగ్ లో కానీ చర్యల్లో కానీ ఎలాంటి అసభ్యత లేదన్నట్లు మాట్లాడింది.

    ఈ షోలో ఎంటర్టైన్మెంట్ ఏమోకానీ డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయ్యాయనే వాదన వినిపిస్తోంది. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ఎపిసోడ్ లో అనసూయ నోటికి పని చెప్పింది. అర్జున్ అంబటి పై ఆమె చేసిన కామెంట్స్ వినడానికి అసభ్యకరంగా ఉన్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్ లో అనసూయ, శ్రీముఖి సరదాగా ఓ గేమ్ ఆడారు. దీనికోసం కిర్రాక్ బాయ్స్ టీం నుండి అర్జున్, చైతుని స్టేజి పైకి పిలిచారు.

    ఇక పనిష్మెంట్ లో భాగంగా అర్జున్, చైతు లకు వ్యాక్స్ స్ట్రిప్ తో హెయిర్ తొలగించాల్సి ఉంటుంది. ముందుగా చైతు చేతిపై వాక్స్ స్ట్రిప్ అంటించి ఒక్కసారిగా లాగేస్తారు అనసూయ, శ్రీముఖి. దీంతో నొప్పి తట్టుకోలేక చైతు గట్టిగా అరుస్తాడు. అయినా వదలరు. రెండోసారి కూడా చైతు కి వాక్స్ చేస్తారు. ఆ తర్వాత అర్జున్ కి చేతి పై కాదు ఛాతి పై వాక్స్ చేయాలి అని అనసూయ అంటుంది. అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అనసూయ మాత్రం వదలదు.

    అర్జున్ ఛాతీ పై వాక్స్ స్ట్రిప్ అంటిస్తుంది అర్జున్ భయ్యా .. నాకు చేతికే ఇలా ఉందంటే .. మరి నీ ఫ్యూచర్ ఏంటో అర్ధమైపోతుంది అంటూ చైతు భయపెడతాడు. గుండెపై ఇబ్బంది అంటే చెప్పండి. కనపడని చోట హెయిర్ తీయమంటే తీస్తాం అంటూ అనసూయ అసభ్యకర కామెంట్స్ చేస్తుంది. దీంతో అంతా గట్టిగా అరిచేసరికి నేను అంటుంది పొట్టపైన అని కవర్ చేస్తుంది. పబ్లిక్ షోలో అంత వల్గర్ గా అనసూయ ఎలా మాట్లాడుతుందని, నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

    కొన్ని సందర్భాల్లో అనసూయ సినిమాల్లో వాడిన బూతులు, డైలాగ్స్, సన్నివేశాలను తప్పుబట్టింది. ఆమె మాత్రం సభ్య సమాజం తలదించుకునే కామెంట్స్ ఒక టెలివిజన్ షోలో చేస్తుంది. అనసూయ తీరుపై జనాల్లో అసహనం వ్యక్తం అవుతుంది.