Sirisilla ; పూర్వీకులు కాకుల రూపంలో ఉంటారంటారు. అందుకే కొన్ని ప్రత్యేక దినాల్లో పిండ ప్రదానం చేసేటప్పుడు కాకిని పిలుస్తుంటారు. కానీ సాధారణ రోజుల్లో కాకి ఎదురైనా, మీద పడినా అశుభంగా భావిస్తారు. ఇక శనీశ్వరుడి వాహనం కాకి. అందువల్ల శని పూజ చేసే సమయంలో కాకిని కూడా తైలంతో అభిషేకిస్తారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో కాకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇలా వివిధ సందర్భాల్లో కాకికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడుతూ వస్తోంది. సాధారణ సమయంలో కాకులు, మనుషులకు కనిపించవు. గ్రామాల్లో ఎక్కడో ఒక చోట ఒకప్పుడు కనిపించేవి. ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. దీంతో వీటికి మనుషులకు సంబంధాలు తక్కువే. కానీ తాజాగా మనుషులపై కాకులు దాడలు చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు కుక్కల భయమే ఉండేది. ఇప్పుడు కాకుల భయం పట్టుకొంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టుపై ఎక్కువగా కాకులు ఉంటున్నాయి. ఇవి రోడ్డుపై వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. విచిత్రమేంటంటే ఈ కాకులు ఆడవారి జోలికి వెళ్లడం లేదు. కేవలం మగవారిపైనే దాడి చేస్తున్నారు.పగబట్టిన కాకుల వలె వచ్చీ పోయే ప్రతీ పురుషుడిపై దాడి చేస్తున్నాయి. దీంతో కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. విచిత్రంగా ఉండడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కొంతమంది ఈ వీడియోపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేవలం మొగవరిపైనే కాకులు దాడి చేస్తున్నాయంటే ఇవి ఆడ కాకులు కావొచ్చని సరదాగా అంటున్నారు. కాకుల దాడి విషయం వైరల్ కావడంతో కొంత మంది పురుషులు సిరిసిల్ల పాత బస్టాండ్ వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. అయితే ఈ కాకులు ఎందుకు దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదని అంటున్నారు. కొందరు ఎదురు దాడికి ప్రయత్నించినా అవి దొరకడం లేదు. దీంతో కాకుల జోలికి పోకుండా ఉండడమే మంచిదని అటువైపు వెళ్లడం లేదు. ఒకవేళ వాటి నుంచి తప్పించుకోవాలనుకున్నా అవి తిరిగి ఎగిరిపోతున్నాయి.
సాధారణంగా కాకి మీదికొస్తే కొందరు అశుభంగా భావిస్తారు. అయితే అనుకోకుండా అలా వస్తే అనుకోవచ్చు. కానీ ఇక్కడి కాకులు మాత్రం ఇక్కడికి వచ్చే ప్రతీ పురుషుడిపై దాడి చేస్తున్నాయి. దీంతో ఇవి కావాలనే మీదికొస్తున్నాయని అంటున్నారు. అయితే సిరిసిల్ల పాత బస్టాండ్ అంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన ఏరియా. ఇక్కడికి చాలా మంది వస్తూ పోతుంటారు. ఇలా వచ్చిన వారిపై ఒక్కసారిగా కాకులు మీదికి రావడంతో భయాందోళనకు గురవుతున్నారు.ఇక వాహనదారులపై కాకుండా నడుచుకుంటూ వెళ్లేవారిపైనే కాకులు మీదకు వస్తున్నాయి. దీంతో ఇటువైపు నడుకుంటూ వెళ్లొద్దని కొందరు సూచిస్తున్నారు. కొందరు ఈ దాడి వెనక కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే తమను దాడి నుంచి రక్షించాలని కోందరు వేడుకుంటున్నారు. ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం దొరుకుతుందో చూడాలి.