Samantha : సమంత(Samantha Ruth Prabhu) కేవలం సినిమాలను మాత్రమే కాదు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమెకు నేషనల్ వైడ్ గా పాపులారిటీ, క్రేజ్ ని తెచ్చిపెట్టింది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విలన్ గా సమంత నటన అందరినీ భయపెట్టేసింది. ఈ సిరీస్ ని రాజ్ & డీకే బ్రదర్స్ నిర్మించడమే కాకుండా, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మళ్ళీ వాళ్లిద్దరూ కలిసి హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటాడెల్'(Citadel Web Series) వెబ్ సిరీస్ ని ఇండియన్ వెర్షన్ లో సమంత, వరుణ్ ధావన్ లను హీరో హీరోయిన్లుగా పెట్టి తీశారు. గత ఏడాది విడుదలైన ఈ యాక్షన్ వెబ్ సిరీస్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.
Also Read : నాకు వచ్చిన కష్టాలు జీవితంలో ఎవరికీ రాకూడదు – సమంత
ఈ వెబ్ సిరీస్ ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. సమంతకు ఒక పక్క ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ ని ఎంతో కష్టపడి చేసింది. రివ్యూస్ కూడా భారీ రేంజ్ లో రాలేదు కానీ, డీసెంట్ స్థాయి లో వచ్చాయి. కానీ ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ కి అమెజాన్ ప్రైమ్ సంస్థకు లాభాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. ముందుగా ఈ సిరీస్ ని రెండు సీజన్స్ గా తీసే ఆలోచనలో ఉండేవారు. ఆ విధంగా సమంత, వరుణ్ ధావన్ లతో కాంట్రాక్టు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టుని రద్దు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ పెద్దగా లాభాలను తీసుకొని రాకపోవడం వల్ల, రెండవ సీజన్ తియ్యాలి అనే ఆలోచనను పక్కన పెట్టేశారట. ఇది సమంత ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ భవిష్యత్తులో ఇదే కాంబినేషన్ లో మరో వెబ్ సిరీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే సమంత ప్రస్తుతం హీరోయిన్ గా మాత్రమే కాదు ,నిర్మాతగా కూడా మారిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొత్తవాళ్లతో కలిసి రీసెంట్ గానే ఆమె ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించింది. రెమ్యూనరేషన్స్ విషయం లో కూడా ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ అనే భేదభావాలు చూపించకుండా అందరికీ సరిసమానంగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి సరికొత్త ట్రెండ్ కి నాంది పలికింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాకు కూడా నిర్మాత ఆమెనే. ఈ చిత్రం తో పాటు నెట్ ఫ్లిక్స్ లో ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. అదే విధంగా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
Also Read : అక్షరాలా 500 కోట్ల ప్రాజెక్ట్ లోకి సమంత..హాలీవుడ్ హీరోయిన్ అవుట్!