Samantha : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత(Samantha Ruth Prabhu), ఒకప్పటి జోరుతో ఇప్పుడు సినిమాలు చేయలేకపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కారణం ఆమెకు మైయోసైటిస్ అనే వ్యాధి సోకడం వల్లే. నాగ చైతన్య తో విడిపోయాను అనే మానసిక బాధ ఒకవైపు, మైయోసైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకడంతో శారీరక బాధ మరోవైపు. సమంత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆమెకు కోట్ల సంపాదన ఉంది. నా ప్రాణాంతక వ్యాధిని నయం చేసుకోవడానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలదు. కానీ సామాన్యులకు ఇలాంటి వ్యాధి సోకితే పరిస్థితి ఏమిటి?, ఆశలు వదిలేసుకోవాల్సిందే కదా. ఈ వ్యాధి సోకినప్పుడు తన మానసిక స్థితి గతులు ఎలా ఉండేవో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ క్లుప్తంగా వివరించింది సమంత. ఆమె చెప్పిన మాటలు వింటే ఎలాంటి వారికైనా వెన్నులో వణుకు పుట్టక తప్పదు.
Also Read : ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.
ఆమె మాట్లాడుతూ ‘ఈ వ్యాధి సోకినప్పుడు నేను ఈ ప్రపంచంలో ఒంటరి దానిని ఐపోయాను అనే భావన కలిగింది. ఈ వ్యాధి తీవ్రత ఎలాంటిదో మీకు అర్థం అయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీకు నీరసంగా అనిపించినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, ఆ తర్వాత నీరసం పోయాక మీ పనులు మీరు చేసుకుంటారు. కానీ ఈ మైయోసైటీస్ వ్యాధి సోకినవాళ్లు ప్రతీ రోజు , ప్రతీ క్షణం ఈ బాధని అనుభవించాల్సిందే. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ వ్యాధి కి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ లేదు, జీవితాంతం భరించాల్సిందే అని చెప్పారు. నేను భయపడిపోయాను, నాలో ధైర్యం సన్నగిల్లింది. నా సన్నిహితులు ఇక నువ్వు సినిమాల్లో నటించలేవు, ప్లాన్ బి ఏదైనా ఉంటే చూసుకో అని సలహా ఇచ్చారు. ఎందుకు నటించకూడదు?, నాకు ప్లాన్ బి లాంటివి ఏమి తెలియవు, నాకు తెలిసింది కేవలం సినిమా ఒక్కటే అని చెప్పాను’.
‘మైయోసైటీస్ వ్యాధి కేవలం రోజుల వ్యవధి లో తగ్గేది కాదు. సంవత్సరాల సమయం పడుతుంది. ఇది కేవలం నా ఒంటరి ప్రయాణం మాత్రమే. ఎదో ఒకరోజు అది పెద్ద సమస్య గా మారుతుందని గ్రహించాను. ఇలాంటి వ్యాధి పగవాళ్లకు కూడా రాకూడదు. కానీ కచ్చితంగా నేను గండాన్ని అధిగమించి సురక్షితంగా ముందుకు వస్తాను అనే నమ్మకం. పోరాటం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. షూటింగ్ చేస్తున్న సమయంలో సమంత ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. షాట్ మధ్య గ్యాప్ లో ఆమె ఆక్సిజన్ సిలిండర్ ని ముక్కుకి తగిలించుకునేది. అంత కష్టాన్ని అనుభవిస్తూ షూటింగ్ చేసేది ఆమె. అందుకే ఈమెని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. చిన్న చిన్న కష్టాలకే మనం చెయ్యాలని అనుకున్న పనులను చేయలేకపోతుంటాము. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె షూటింగ్ లో పాల్గొన్నది. యువత కచ్చితంగా ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.